iDreamPost

ఈ రైలు టికెట్ ధరతో చిన్న కుటుంబం సెటిలవుతుంది.. ధర ఎన్ని లక్షలంటే?

ట్రైన్ జర్నీ చాలా మందే చేసుంటారు. టికెట్ ధరలు తక్కువగానే ఉండడంతో రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతారు. మరి ఓ ట్రైన్ లో టికెట్ ధర ఎన్ని లక్షలో తెలుసా? ఈ టికెట్ ధరతో ఓ కుటుంబం సెటిల్ అవొచ్చు.

ట్రైన్ జర్నీ చాలా మందే చేసుంటారు. టికెట్ ధరలు తక్కువగానే ఉండడంతో రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతారు. మరి ఓ ట్రైన్ లో టికెట్ ధర ఎన్ని లక్షలో తెలుసా? ఈ టికెట్ ధరతో ఓ కుటుంబం సెటిల్ అవొచ్చు.

ఈ రైలు టికెట్ ధరతో చిన్న కుటుంబం సెటిలవుతుంది.. ధర ఎన్ని లక్షలంటే?

రైలు ప్రయాణాన్ని సామాన్యుడి విమాన ప్రయాణంగా భావిస్తారు. నిత్యం లక్షలాది మంది రైలు ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు సౌకర్యంగా ఉండడం, టికెట్ ఛార్జీలు సైతం తక్కువగా ఉండడంతో రైలు ప్రయాణానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అయితే ట్రైన్ టికెట్ల ధరలు మహా అయితే స్లీపర్, ఏసీ కోచ్ లలో దూరాన్ని బట్టి మహా అయితే వెయ్యి లేదా రెండు వేల వరకు ఉంటుంది. జనరల్ క్లాస్ లో మాత్రం మరింత తక్కువగానే ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ట్రైల్ లో మాత్రం టికెట్ ధర ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు. వందలు కాదు.. వేలు కాదు.. ఏకంగా లక్షల్లో ఉంది. ఆ ట్రైల్ లో ప్రయాణించాలంటే రూ. 4.5 లక్షలు పెట్టి టికెట్ కొనాల్సిందేనట.

టికెట్ ధర లక్షల రూపాయలున్న ఈ రైలు పేరు సెవెన్ స్టార్స్ ఆఫ్ క్యూషూ. రెండు రోజుల్లో మూడు వేల కి.మీల పరిధిలో తిరిగే దీని టికెట్ ధర అక్షరాల రూ. 4.5 లక్షలు. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది నిజమేనండోయ్. అయితే ఇది మన దేశంలో మాత్రం కాదు. జపాన్ ప్రారంభించిన ఈ తొలి లగ్జరీ స్లీపర్ రైలు ఇది. అగ్ని పర్వతాలు, సముద్రాలు, ప్రకృతి సౌందర్యాలను తిప్పి చూపిస్తుంది. ఇక లోపల కూడా సెవెన్ స్టార్ హోటల్ ను తలపించే సౌకర్యాలు కలిగి ఉండడం దీనిలోని మరో ప్రత్యేకత.

భాతర్ లో కూడా మహారాజా ఎక్స్ ప్రెస్ పేరిట ఓ పర్యాటక రైలు ఉన్న సంగతి తెలిసిందే. రైలు టికెట్ ధర 4.5 లక్షలు అని తెలియడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. మరి ఇన్ని లక్షలు పెట్టి సామాన్యులు ప్రయాణించాలంటే ఉన్న ఆస్తులు అమ్ముకున్న ప్రయాణించలేరు. ఇక మన లాంటి దేశంలో పేద మధ్యతరగతి వారే ఎక్కువ. ఇప్పుడున్న ఛార్జీలకే భారంగా భావిస్తుంటారు. ఇక 4.5 లక్షలు పెట్టి ప్రయాణించడానికి ఎవరు ముందుకు వస్తారు చెప్పండి. 4.5 లక్షలతో ఓ చిన్న కుటుంబం ఏ చింత లేకుండా హ్యాపీగా జీవించొచ్చు. మరి ట్రైన్ టికెట్ ధర 4.5 లక్షలు అన్న విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి