iDreamPost

రాజధాని మార్చినా మాకు ఇబ్బంది లేదు

రాజధాని మార్చినా మాకు ఇబ్బంది లేదు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న మూడు రాజధానులకు మరింత మద్దతు వచ్చేలా ఆదివారం కొత్త పరిణామం చోటుచేసుకుంది. రాజధాని మార్చినా తమకు ఇబ్బంది లేదని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని పేర్కొన్నాయి.

అమరావతి ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియా తో మాట్లాడుతూ… జీఎన్‌ రావు కమిటీ నివేదికను ఆహ్వానిస్తున్నామన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ వలన అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఉద్యోగులకు కావల్సిన అన్ని సౌకర్యాలు ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తారనే నమ్మకం ఉందని బొప్పరాజు వెంకటేశ‍్వర్లు పేర్కొన్నారు. అమరావతి ఏర్పాటులో చంద్రబాబు అందరి అభిప్రాయం తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భవిష్యత్‌ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారని బొప్పరాజు అన్నారు. తాత్కాలిక కార్యాలయాల్లో కనీస మౌలిక వసతులను చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. రాజధాని ఏర్పాటు అనేది మన ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్మించుకోవాలని, లక్ష కోట్లు పెట్టి రాజధానిని నిర్మించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులకు ఏం కావాలో అడగకుండానే అన్నీ ముఖ్యమంత్రి ఇస్తున్నారన్నారు. ఆర్టీసీని ప్రభుత్వపరం చేసి చరిత్ర సృష్టించారని, అడగకుండానే కార్మికుల జీతాలు పెంచారన్నారని కొనియాడారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి