iDreamPost

ఈ కారులో 30 రూపాయలతో 300 కిలోమీటర్లు.. ఖమ్మం కుర్రోడి ఘనత..

ఈ కారులో 30 రూపాయలతో 300 కిలోమీటర్లు.. ఖమ్మం కుర్రోడి ఘనత..

ఇటీవల అంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఛార్జీతో ఎక్కువ దూరం ప్రయాణించొచ్చు. తాజాగా తెలంగాణాకి చెందిన ఓ యువ ఇంజనీర్ కొత్త ఎలక్ట్రిక్ కారుని తయారు చేశాడు. ఈ కారు 30 రూపాయలతో 300 కిలోమీటర్లు ప్రయాణించేలా తయారు చేశాడు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల వేడుకల సందర్భంగా గురువారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని పరేడ్‌ గ్రౌండ్‌కు ఈ కారుని తయారు చేసిన యువ ఇంజనీర్ రాకేష్ ఈ కారుని ప్రదర్శన కోసం తీసుకొచ్చాడు. ఈ ఎలక్ట్రికల్‌ కారు చూడటానికి కొంచెం చిన్నగా ఉన్నా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం తీసుకెళ్తుంది. ఈ కారుని ఒక్కసారి చార్జ్‌ చేస్తే 5 నుంచి 10 యూనిట్ల వరకు విద్యుత్‌ అవసరమవుతుందని, పది యూనిట్లు వాడినా కేవలం 30 రూపాయల వరకు మాత్రమే ఖర్చు అవుతుందని, 10 యూనిట్ల విద్యుత్ తో దాదాపు 300 కిలోమీటర్లు పని చేస్తుందని రాకేశ్‌ వెల్లడించాడు. అవతరణ దినోత్సవాల భాగంగా పరేడ్ గ్రౌండ్ కి తీసుకురాగా ఈ ఎలక్ట్రిక్ కారుని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, తదితర అధికారులు ఆసక్తిగా పరిశీలించి అభినందించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి