iDreamPost

Pepsi యాడ్‌లో షారూఖ్‌తో నటించిన ఈ కుర్రాడు.. ఇప్పుడో స్టార్ హీరో..!

వినోద రంగం ఎప్పుడు, ఎవరినీ ఏ స్థాయిలో ఎక్కడ కూర్చొబెడుతుందో చెప్పడం కష్టం. చిన్న చిన్న క్యారెక్టర్లు వేసే నటుడ్ని.. టాప్ హీరోను చేస్తుంది. స్టార్ స్టేటస్ హోదాను అనుభవిస్తున్న నటుడికి సినిమా అవకాశాలే కాదూ పత్తా లేకుండా పోయిన దాఖలాలు ఉన్నాయి.. ఇదంతా ఎందుకంటే..?

వినోద రంగం ఎప్పుడు, ఎవరినీ ఏ స్థాయిలో ఎక్కడ కూర్చొబెడుతుందో చెప్పడం కష్టం. చిన్న చిన్న క్యారెక్టర్లు వేసే నటుడ్ని.. టాప్ హీరోను చేస్తుంది. స్టార్ స్టేటస్ హోదాను అనుభవిస్తున్న నటుడికి సినిమా అవకాశాలే కాదూ పత్తా లేకుండా పోయిన దాఖలాలు ఉన్నాయి.. ఇదంతా ఎందుకంటే..?

Pepsi యాడ్‌లో షారూఖ్‌తో నటించిన ఈ కుర్రాడు.. ఇప్పుడో స్టార్ హీరో..!

పరిశ్రమ ఏదైనా.. కష్ట పడితే ఫలితం దక్కుతుంది. అయితే పేరు, డబ్బు రావాలంటే మాత్రం ఎంటర్ టైన్ మెంట్ రంగాన్ని మించింది మరోటి లేదు. ఇప్పుడు స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న నటులంతా చిన్న సినిమాల నుండే పేరు తెచ్చుకున్న వారే. మోడలింగ్, వాణిజ్య ప్రకటనలు (యాడ్స్), సీరియల్స్, యాంకర్స్‌గా చేసి టాప్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్న వారున్నారు. షారూఖ్ ఖాన్ నుండి యష్ వరకు ఈ జాబితా చాలా పెద్దదే. తమను తాము నిరూపించుకునేందుకు ఉన్న చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు యాక్టర్స్. ఆ కోవలోకే వస్తాడు ఈ పిక్‌లో కనిపిస్తున్న యంగ్ కుర్రాడు కూడా. తల్లిదండ్రులు ఇండస్ట్రీలో ఉన్నా.. స్వయం కృషితో పైకి ఎదిగాడు.

ఈ పిక్‌లో బాలీవుడ్ బాద్ షా తో కనిపించిన కుర్రాడు ఎవరో గుర్తుపట్టండి. మూతి మీద మీసం కూడా రాని ఈ యంగ్ బాయ్.. ఇప్పుడు బాలీవుడ్‌లో టాప్ స్టార్లలో ఒకడు. అతను మరెవ్వరో కాదూ.. రొమాంటిక్ హీరో షాహిద్ కపూర్. తండ్రి టీవీ నటుడు పంకజ్ కపూర్, ఆమె తల్లి నీలిమా అజీమ్ క్లాసికల్ డ్యాన్సర్, నటి కూడా. అయితే అతడు పుట్టిన మూడేళ్లకే తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రి ముంబయి మకాం మార్చేయగా.. షాహీద్ అమ్మ, అమ్మమ్మల దగ్గర ఢిల్లీలో పెరిగాడు. అతడికి 10 ఏళ్లు ఉన్న సమయంలో తల్లి ముంబయికి షిఫ్ట్ అయ్యారు. ఆమె నటుడు రాజేష్ ఖతర్‌ను వివాహం చేసుకున్నారు.  వారు విడిపోయేంత వరకు వారితో కలిసే ఉన్నాడు షాహీద్. చిన్నప్పుడే టీవీ యాడ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్, సైడ్ డ్యాన్సర్‍గా కనిపించాడు.

కాంప్లెన్, పెప్సీ వంటి యాడ్స్‌లో కనిపించాడు. అందులో ఐ యామ్ ఎ కాంప్లెన్ గర్ల్, ఐ యామ్ ఎ కాంప్లెన్ బాయ్ అంటూ కాంప్లెన్ యాడ్‌లో కనిపించేది షాహీదే. పెప్సీ అనగానే గుర్తుకు వచ్చే కాప్షన్ ఏ దిల్ మాంగే మోర్ ..ఆహా. ఆ యాడ్‌లో కనిపించాడు ఈ యంగ్ టాలెంట్. షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీ, కాజల్ వంటి బాలీవుడ్ దిగ్గజ నటీనటులతో కలిసి ప్రకటనలో మెరిశాడు. ఆ తర్వాత 2003లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇష్క్- విష్క్ అతడి తొలి సినిమా. వివాహ్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జబ్ వియ్ మెట్ బ్లాక్ బాస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. రాజ్ కుమార్, ఉడ్తా పంజాబ్, పద్మావత్ వంటి హిట్స్ ఉన్నాయి. తెలుగు మూవీస్ అర్జున్ రెడ్డి, జెర్సీ హిందీ వర్షన్స్‌లో నటించింది మనోడే. ప్రస్తుతం రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.