iDreamPost
android-app
ios-app

తేజ పక్కన కనిపిస్తోన్న ఈ బేబీ గర్ల్.. స్టార్ హీరోయిన్ అని తెలుసా..?

హనుమాన్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిన సజ్జా తేజ చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన మూవీల్లో ఒకటి యువరాజు. ఇందులో సజ్జా తేజ.. కీలకంగా వ్యవహరిస్తాడు. అయితే ఇదే సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ కూడా చైల్డ్ ఆరిస్టుగా కనిపిస్తుంది. ఆమె ఎవరో తెలుసా..?

హనుమాన్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిన సజ్జా తేజ చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన మూవీల్లో ఒకటి యువరాజు. ఇందులో సజ్జా తేజ.. కీలకంగా వ్యవహరిస్తాడు. అయితే ఇదే సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ కూడా చైల్డ్ ఆరిస్టుగా కనిపిస్తుంది. ఆమె ఎవరో తెలుసా..?

తేజ పక్కన కనిపిస్తోన్న ఈ బేబీ గర్ల్.. స్టార్ హీరోయిన్ అని తెలుసా..?

సినిమాల్లో అప్పుడప్పుడు కొన్ని సీన్లలో కీలకంగా మారుతుంటారు చైల్డ్ ఆర్టిస్టులు. కథను మలుపు తిప్పే సన్నివేశాల్లో వీరిదే ప్రధాన హస్తంగా ఉంటుంది. లేదా సినిమా కథ మొత్తం వీరి చుట్టూ అల్లుకుంటూ ఉంటుంది. చైల్డ్ ఆర్టిస్టుల కారణంగా అనేక సినిమాలు ఆడాయి.. ఆడుతున్నాయి. ముఖ్యంగా షామిలి.. బేబీ షామిలీగా ఎంతగా అలరించిందో అందరికీ తెలుసు. ఓ రకంగా చెప్పాలంటే.. హీరోయిన్‌గా కంటే.. చైల్డ్ ఆర్టిస్టుగానే ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకుంది. అలాగే శ్రీదేవి, తరుణ్, షాలిని, కుట్టి పద్మిని వంటి వారు చిన్నప్పుడు అలరించి.. ఆ తర్వాత స్టార్లుగా మెప్పించారు.  తేజ సజ్జా, కావ్య కళ్యాణ్ రామ్ టాలీవుడ్ లో యంగ్ స్టార్లుగా ఎదుగుతున్న సంగతి విదితమే. బలగం మూవీతో మెప్పించింది కావ్య. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు తేజ.

తేజ చైల్డ్ ఆర్టిస్టుగా కీలకంగా వ్యవహరించిన సినిమాల్లో ఒకటి యువరాజు. ఈ  మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడిగా మెప్పించిన తేజ.. ఈ సంక్రాంతి బరిలో ఆయనతో పాటుగా తన చిత్రాన్ని విడుదల చేసిన సంగతి విదితమే. ఇదిగో మీరు చూస్తున్న ఈ పిక్ ఆ సినిమాలోనిదే. అయితే ఈ బుుడ్డోడు మన సజ్జా తేజ అని తెలుసు. ఆ పక్కన కళ్లు మిటకరించి చూస్తుంది చూశారా.. ఆ పిల్ల ఎవరో గుర్తు పట్టారా.. చెప్పండి.. చూద్దాం. ఆమె కూడా ఓ స్టార్ హీరోయిన్ ఇప్పుడు. తెలుగులో అనేక సినిమాలు చేసి.. తమిళనాట అడుగుపెట్టి..టాప్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్లిపోయంది. ఆమె ఎవరంటే.. పదహారాల తెలుగు అమ్మాయి శ్రీ దివ్య. యువరాజు చిత్రంలో తేజ, శ్రీ దివ్య కలిసి పిల్లల గ్యాంగ్‌లో కనిపిస్తారు. ఈ సినిమాలో తేజకు శ్రీ దివ్య మధ్య సీన్లు కూడా ఉన్నాయి.

ఆడ పిల్ల త్వరగా ఎదిగేస్తుందన్న సామెతను నిజం చేస్తూ.. 2010లో మససారా మూవీతో హీరోయిన్ అవతారం ఎత్తేసింది ఈ అమ్మాయి. అంతక ముందు సీరియల్స్ చేసింది. బస్ స్టాప్, మల్లెల తీరంలో సిరిమల్లో పువ్వు వంటి చిత్రాలు చేసింది. కానీ ఇక్కడ అంత పేరు రాకపోవడంతో కోలీవుడ్‌కు వెళ్లింది. అక్కడ శివ కార్తీకేయన్, విక్రమ్ ప్రభు, రానా, ఆర్య, కార్తీ వంటి యంగ్ స్టార్స్ తో జత కట్టి కోలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగులో కూడా కేరింతలో కనిపించింది. తమిళ సినిమాలతోనే బిజీగా మారిపోయి.. టాలీవుడ్ సినిమాల్లో నటించలేదు. ఇటీవల మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ భామ. గత ఏడాది తమిళ చిత్రం రైడ్ మూవీ చేసింది. ఇప్పుడు మరో చిత్రం విడుదలకు సిద్ధమౌతుంది. ఈ తెలుగు అమ్మాయి.. పరాయి రాష్ట్రంలో విజయ బావుటా ఎగురవేయడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetbetvoleKingroyal girişcasibomgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobetMatadorbetMeritking