iDreamPost

స్టార్ హీరోలతో నటించాడు..నేడు సెక్యూరిటీ గార్డుగా..

అందమైన లోకమని.. రంగు రంగులుంటాయని సినీ లోకాన్ని అంటుంటారు. కానీ ఆ సినీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం. అవకాశాలు దొరకడం చాలా కష్టతరం. ఆఫర్లు వచ్చాక కూడా నిలబెట్టుకోవడం మరింత కష్టం. లేకుంటే జీవితం తల్లకిందులు అవుతుంది.

అందమైన లోకమని.. రంగు రంగులుంటాయని సినీ లోకాన్ని అంటుంటారు. కానీ ఆ సినీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం. అవకాశాలు దొరకడం చాలా కష్టతరం. ఆఫర్లు వచ్చాక కూడా నిలబెట్టుకోవడం మరింత కష్టం. లేకుంటే జీవితం తల్లకిందులు అవుతుంది.

స్టార్ హీరోలతో నటించాడు..నేడు సెక్యూరిటీ గార్డుగా..

అందమైన రంగుల ప్రపంచమైన సినీ రంగంలో అందరూ సక్సెస్ కాలేరు. కొంత మందిని మాత్రమే కళామతల్లి తన ఒడిలోకి తీసుకుంటుంది. అలాగే కొన్ని సార్లు సక్సెస్ అయ్యినా, కెరీర్ సరిగ్గా ప్లాన్ చేసుకోక బోల్తా పడిన వారున్నారు. ఆస్తులు, పాస్తులు అమ్ముకుని, చివరకు చనిపోయే సమయంలో నా అనేవారు కూడా లేక.. మట్టిపాలు అయినవారున్నారు. అలాగే అద్దె ఇంట్లో ఉంటూ తినడానికి సరైన తిండి కూడా లేక బాధపడుతున్న నటీనటులను చూశాం. అనారోగ్యం పాలై మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేక, ఆర్థిక సాయం కోసం ఎదురు చూపులు చూడటం విన్నాం. తాజాగా ఓ నటుడు అత్యంత దయనీయ స్థితి వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు స్టార్ హీరోలతో నటించిన ఇతగాడు.. ఇప్పుడు ఎలా మారిపోయాడంటే..

సినిమా అవకాశాలు లేకపోవడంతో సవి సిద్దు అనే నటుడు వాచ్ మెన్‌గా మారిపోయాడు. అక్షయ్ కుమార్, కేకే మీనన్ వంటి స్టార్లతో నటించాడు. బ్లాక్ ఫ్రైడే, గులాల్, పటియాలా హౌస్ వంటి చిత్రాల్లో సవి సిద్దు నటించాడు. అనురాగ్ కశ్యప్, నిఖిల్ అద్వాణీ వంటి ప్రముఖ దర్శకులతో కలిసి పని చేశాడు. కానీ సడన్‌గా కొన్ని సంవత్సరాల క్రితం ఓ అపార్ట్ మెంట్ వాచ్ మెన్‌గా కనిపించి ఆశ్చర్యపరిచాడు. అవకాశాలు లేకపోవడంతో ఇలా మారానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తన జీవితంలో తన భార్య మరణం కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పాడాయన. ఈ తర్వాత ఒంటరిని అయిపోయానని, ఆ బాధ నుండి బయటపడేందుకు చాలా సమయం పట్టిందని అన్నారు. కానీ ఆ సమయంలో అవకాశాలు రాలేదన్నారు.

దీంతో కడుపు నింపుకోవడం కోసం వాచ్ మెన్‌గా మారాల్సి వచ్చిందన్నారు. 12 గంటలు పనిచేస్తున్నట్లు తెలిపారు. బస్సు టికెట్ కూడా కొనలేని దుస్థితిలో ఉన్నట్లు తెలిపారు. ఒకప్పుడు సినిమాల్లో కనిపించిన తానే.. ఇప్పుడు సినిమా చూడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి ఇంటర్వ్యూ వైరల్ అవ్వడంతో అనురాగ్ కశ్యప్, రాజ్ కుమార్ రావు అతడికి మద్దతుగా నిలిచారు. ఛాన్సులు ఇస్తామని తెలిపారు. 2020లో మస్కా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే అక్కడి నుండి అతడు ఏం చేస్తున్నాడో అన్న వివరాలు తెలియరాలేదు. ఒక నటుడు ఇలా కావడంపై  అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి