iDreamPost

ఈ ముగ్గురూ మామూలోళ్లు కాదు.. CCTVలతో బయటపడ్డ నిజం!

ముగ్గురూ కలిసి చేసిన పని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది. ఆ రికార్డులు పోలీసులకు సైతం చేరాయి. పోలీసులు ముగ్గర్నీ అరెస్ట్‌ చేశారు. వారిని కోర్టులో హాజరు పర్చి రిమాండ్‌కు తరలించారు.

ముగ్గురూ కలిసి చేసిన పని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది. ఆ రికార్డులు పోలీసులకు సైతం చేరాయి. పోలీసులు ముగ్గర్నీ అరెస్ట్‌ చేశారు. వారిని కోర్టులో హాజరు పర్చి రిమాండ్‌కు తరలించారు.

ఈ ముగ్గురూ మామూలోళ్లు కాదు.. CCTVలతో బయటపడ్డ నిజం!

ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో బొత్తిగా తెలియకుండా పోతోంది. మంచిగా నటించి మోసాలు చేసే వారు బాగా ఎక్కువయ్యారు. అవసరాలకు తగ్గట్టుగా రంగులు మారుస్తుంటారు. వెన్నుపోటు పొడుస్తున్న వారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసే వారు పెచ్చు మీరి విలయతాండవం చేస్తున్నారు. ఇందుకు ఆడ, మగ అన్న తేడా లేకుండా పోతోంది. తాజాగా, ఓ ముగ్గురు వ్యక్తులు పని చేస్తున్న నగల షాపునే దోచేశారు. పెద్ద మొత్తంలో బంగారం నగలు దోచుకెళ్లారు.

సీసీ టీవీ కెమెరాల ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. అరుమణకు చెందిన 29 ఏళ్ల అనిష్‌.. పమ్మంకు చెందిన శాలినీ, పయనంకు చెందిన అదిష కన్యాకుమారిలోని మర్తాండంలోని ఓ నగల కొట్టులో పని చేస్తూ ఉన్నారు. ముగ్గురివీ దిగువ మధ్య తరగతి కుటుంబాలు. ఎప్పుడూ రిచ్‌గా బతకాలని ముగ్గురూ భావిస్తుండేవారు. ఈ నేపథ్యంలో వీరు ఓ కన్నింగ్‌ ఆలోచన చేశారు. అదిష, శాలినీ పని చేస్తున్న నగల కొట్టులో ఎవరికీ తెలియకుండా నగలు దొంగలించాలని డిసైడ్‌ అయ్యారు.

అనుకున్న ప్రకారం కొద్ది కొద్దిగా బంగారు నగలను దొంగిలించటం మొదలు పెట్టారు. తర్వాత ఆ నగలను అమ్మి ఎవరి వాటా వాళ్లు పంచుకున్నారు. అనిష్‌ బైకు, విలాసవంతమైన ఇళ్లు కొన్నాడు. రోజులు గడుస్తున్నాయి. బంగారం నగల ఆడిటర్‌ నగల్ని లెక్కకట్టగా.. చాలా వరకు నగలు కనిపించకుండా పోయాయని తేలింది. దీంతో సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అనిష్‌, శాలినీ, అదిషాలు నగల్ని దొంగతనం చేస్తున్న దృశ్యాలు వెలుగు చూశాయి. యజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనిష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

తర్వాత శాలినీ, అదిషాలను కూడా అరెస్ట్‌ చేశారు. వారిని విచారించారు. ఈ ముగ్గురు కలిసి ఎంత మొత్తం నగలను దొంగలించారో తెలుసుకున్నారు. వీరు 54 తులాల బంగారం, 6 కిలోల వెండి దొంగతనం చేసినట్లు తేలింది. ఇక, సీసీటీవీల్లో అనిష్‌ దొంగతనం చేసే విధానం కూడా బయట పడింది. అనిష్‌ ఆ కంపెనీలో సేల్స్‌ మ్యాన్‌గా పని చేస్తూ ఉన్నాడు. నగల షాపు రద్దీ తక్కువ ఉన్నపుడు అనిష్‌ నగల్ని సర్దుతున్నట్లు నటిస్తాడు. ఎవ్వరూ పక్కన లేని సమయంలో నగల్ని జేబులో వేసుకుంటాడు. మిగిలిన వాళ్లు కూడా ఇలానే చేసేవారు. మరి, పని చేసే నగల కొట్టులోనే భారీ ఎత్తున బంగారం కొట్టేసిన ఈ ముగ్గురిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి