iDreamPost

మీ ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉందా?? ఈ మొక్కలని పెంచండి.. దోమలు మీ ఇంటికి రావు..

మీ ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉందా?? ఈ మొక్కలని పెంచండి.. దోమలు మీ ఇంటికి రావు..

ప్రస్తుతం ఎండాకాలంలో చాలామంది డాబా పైన లేదా బయట పడుకుంటారు. కానీ దోమలు ప్రశాంతంగా పడుకోనివ్వవు. వర్షాకాలంలో అయితే ఈ దోమల బెడద మరింత ఎక్కువగా ఉంటుంది. దోమల వలన డెంగ్యూ, మలేరియా వచ్చే అవకాశం ఉంది. మామూలుగానే ఇళ్లల్లో దోమలు ఎక్కువగావస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని మనం కంట్రోల్ చేయడానికి గుడ్ నైట్, జెట్ లాంటి పలు కాయిల్స్, రసాయనాలు వాడుతుంటాము కానీ వీటి వలన ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదం ఉంది. కాబట్టి కొన్ని రకాల మొక్కలను పెంచడం ద్వారా కూడా దోమలను అరికట్టవచ్చు, అటు పర్యావరణంపై కూడా దోహదం అవుతుంది.

తులసి మొక్క అనేది కామన్ గా అందరి ఇళ్లల్లో ఉంటుంది. తులసి మొక్కకి మనం పూజలు కూడా చేస్తాము. తులసి చెట్టు దోమల లార్వాను చంపుతుంది. తులసి మొక్క వాసన దోమలను దరిచేరనివ్వదు. అందుకే ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండాలని పూర్వకాలమే మన పెద్దలు చెప్పారు. ఇప్పుడు వచ్చిన అపార్ట్మెంట్ కల్చర్ లో తులసి మొక్క అసలు కనపడట్లేదు నగరాల్లో. అందుకే కచ్చితంగా ఇంట్లో తులసి మొక్కని పెంచండి.

గుల్మెహంది అనే మొక్క కూడా దోమలను మన ఇంటిలోనికి రాకుండా కాపాడుతుంది. ఎక్కువగా వాసనను కలిగి ఉన్న మొక్కలు దోమలను మరియు ఇతర కీటకాలను దగ్గరికి రాకుండా చేస్తాయి. దోమలు ఈ మొక్కకు ఉన్న ఎక్కువ ఘాటును తట్టుకోలేవు .

పుదీనా మన ఇంట్లో రకరకాల వంటల్లో వాడుతాము. దీన్ని ఈజీగా ఇంట్లో పెంచుకోవచ్చు కూడా. పుదీనా వల్ల కూడా దోమలు ఇంట్లోకి రావు ఎందుకంటే ఇది కూడా బాగా వాసనను కలిగి ఉంటుంది.

వాము మొక్క, లేమాన్ గ్రాస్ మరియు బంతిపూల చెట్లు కూడా దోమల నుండి మనల్ని కాపాడతాయి. కాబట్టి ఇలాంటి మొక్కలు మన ఇంటి బయట, లేదా ఇంట్లో ఉండేలా చూసుకుంటే దోమల బెడద తప్పుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి