iDreamPost

పాన్ ఇండియా సినిమాకు వేరే మార్గం లేదు

పాన్ ఇండియా సినిమాకు వేరే మార్గం లేదు

నిన్న కెజిఎఫ్ 2 కొత్త రిలీజ్ డేట్ ట్రేడ్ తో పాటు ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఏ అక్టోబర్ లోనో డిసెంబర్ లోనో వస్తుందనుకుంటే ఏకంగా 2022 ఏప్రిల్ 14కి పోస్ట్ పోన్ చేయడంతో యష్ అభిమానులు నిరాశ చెందారు. పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు మోస్తున్న కెజిఎఫ్ 2 చిన్న చిన్న పనులు మినహా మొత్తం ఎప్పుడో పూర్తయ్యింది. మరి ఇంత కఠిన నిర్ణయం ఎలా తీసుకున్నారనేదే అందరి మదిలో మెదులుతున్న సందేహం. ఎందుకంటే దీపావళి నుంచి దేశవ్యాప్తంగా కరోనా లేకుండా పరిస్థితులు సాధారణంగా మారిపోయి ఎప్పటిలాగే థియేటర్లకు జనం పోటెత్తుతారనే అంచనాలు ఉన్నాయి.

అలాంటపుడు ఇలా ఎందుకు చేశారనే అనుమానం రావడం సహజం. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటిది ఓవర్ సీస్ మార్కెట్. చాలా దేశాల్లో ఇంకా పరిస్థితి కుదుటపడలేదు. కొన్ని చోట్ల కేసులు అలాగే నమోదవుతున్నాయి. యుఎస్ లో థియేటర్లు తెరుచుకున్నప్పటికీ గతంలో వచ్చే స్థాయిలో రెవిన్యూ లేదని రిపోర్ట్స్ ఉన్నాయి. ఇటీవలే వచ్చిన బెల్ బాటమ్ ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ చెప్పుకోదగ్గ పెరఫార్మెన్సు చేయలేదు. టాక్ ఎలా ఉన్నా అక్షయ్ కుమార్ రేంజ్ కు తగ్గట్టు కలెక్షన్లు లేవనేది ట్రేడ్ చెబుతున్న మాట. ఢిల్లీ లాంటి నగరాల్లో జనం ఇంకా హాళ్లకు వచ్చే మూడ్లో లేరనే క్లారిటీ వచ్చేసింది

ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజమౌళి ఆర్ఆర్ఆర్ కూడా ఏప్రిల్ కే ప్లాన్ చేసుకుందనే లీక్స్ వచ్చిన నేపథ్యంలో కెజిఎఫ్ 2 చాలా తెలివిగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు జక్కన్న టీమ్ కి చిక్కొచ్చి పడింది. జనవరిలో సంక్రాంతి బెర్త్ దొరికే అవకాశం లేదు. అది కుదరదు కాబట్టి సమ్మర్ ఒకటే ఛాన్స్. కెజిఎఫ్ 2తో ఫేస్ టు ఫేస్ క్లాష్ పెట్టుకోలేరు. అలా చేద్దామన్నా డిస్ట్రిబ్యూటర్ల నుంచి వద్దనే ఒత్తిడి ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే కెజిఎఫ్ 2 పక్కా స్కెచ్ తో విడుదల తేదీని చెప్పేసి సేఫ్ గేమ్ ఆడేసింది, అయితే రాఖీ భాయ్ దర్శనానికి మరీ ఎనిమిది నెలలు అదనంగా వేచి చూడాల్సి రావడమే ఫ్యాన్స్ కు మింగుడుపడని విషయం

Also Read : బుల్లితెరపై RRR హీరోల సందడి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి