iDreamPost

ట్రైన్, పబ్లిక్ ప్లేస్‌లల్లో ఛార్జింగ్ పెడుతున్నారా?.. మీ ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్!

ట్రైన్లు, బస్టాండ్ లల్లో మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టినట్లైతే హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు. జ్యూస్ జాకింగ్ అనే కొత్త రకం సైబర్ మోసంతో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

ట్రైన్లు, బస్టాండ్ లల్లో మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టినట్లైతే హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు. జ్యూస్ జాకింగ్ అనే కొత్త రకం సైబర్ మోసంతో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

ట్రైన్, పబ్లిక్ ప్లేస్‌లల్లో ఛార్జింగ్ పెడుతున్నారా?.. మీ ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్!

రోజు రోజుకు సైబర్ మోసాలు పెచ్చు మీరుతున్నాయి. కొత్త రకం మోసాలతో సైబర్ క్రిమినల్స్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు మరో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో మీరు వాడే ఫోన్ సులభంగా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉన్నట్లు టెక్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ట్రైన్లల్లో లేదా పబ్లిక్ ప్లేస్ లల్లో ఉండే ఛార్జింగ్ పాయింట్ల వద్ద ఛార్జింగ్ పెట్టుకునే వారిని టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఛార్జింగ్ పాయింట్ల వద్ద మాల్వేర్ వర్షన్లతో ఫోన్ హ్యాకింగ్ లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

జ్యూస్ జాకింగ్ అనే కొత్త రకం సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. జ్యూస్ జాకింగ్ ద్వారా ఫోన్లను హ్యాక్ చేస్తున్నారట సైబర్ నిందితులు. రైల్వే స్టేషన్‌లో ఛార్జింగ్ పెట్టే ఛార్జర్‌లో యూఎస్బీ కేబుల్ ను ఉంచి డేటా చోరికి పాల్పడుతారు సైబర్ నేరగాళ్లు. ఫోన్లను, ల్యాప్ టాప్ లకు ఆ కేబుల్ ద్వారా ఛార్జింగ్ పెట్టినప్పుడు అది మొబైల్‌లోని మొత్తం డేటాను సేకరించి అందులోకి పంపిస్తుంది. ఇలా చేయడాన్ని జ్యూస్ జాకింగ్ అంటారు. మీరు ఈ కేబుల్‌ను కనెక్ట్ చేసి ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఛార్జ్ చేయడం ప్రారంభించినప్పుడల్లా, స్క్రీన్‌పై పాప్-అప్ కనిపిస్తుంది. మీరు ఈ కేబుల్‌ని వాడాలనుకుంటున్నారా అని అడుగుతుంది.

అయితే ఈ నోటిఫికేషన్‌ను చాలా మంది స్కిప్ చేస్తున్నారు. దీంతో మాల్వేర్ వైరస్ నెమ్మదిగా మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లోకి ప్రవేశిస్తుంది. ఇందుకు రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, పబ్లిక్ ప్లేసుల్లో ఉండే ఛార్జింగ్ పాయింట్లను కేంద్రంగా చేసుకుని హ్యాకింగ్ లకు పాల్పడుతున్నారట. ఛార్జింగ్ పోర్ట్‌లోకి ఫ్లగ్ చేయడం వల్ల మీ ఫోన్ హ్యాక్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫోన్‌లోకి హానికరమైన మాల్వేర్ వైరస్‌ను పంపి అందులో నుంచి మీ వ్యక్తిగత, సమాచారాన్ని కాజేస్తారు. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ కు పాల్పడడం లేదా బ్యాంక్ ఖాతాలను లూటీ చేసే అవకాశాలు ఉంటాయి.

మీ ఫోన్ హ్యాకింగ్ బారిన పడకుండా ఉండాలంటే..

మీరు ఏదైనా పని నిమిత్తం బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఫోన్ లేదా ల్యాప్ టాప్ లకు బ్యాటరీ ఫుల్ ఉండేలా చూసుకోవాలి. పబ్లిక్ ప్లేసులలో ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఫోన్లో ఏదైనా వార్నింగ్ నోటిఫికేషన్ వచ్చినట్లైతే, వెంటనే ఛార్జింగ్ తీసేయాలి. హ్యాకింగ్ బారిన పడకుండా ఉండేందుకు సొంత కేబుల్స్‌తో ఛార్జ్ చేయాలి. అప్రమత్తంగా ఉన్నట్లైతే సైబర్ మోసాలకు గురికాకుండా బయటపడొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి