iDreamPost

కొత్త ఎన్నికల కమిషనర్‌ను తెరపైకి తెచ్చిన ఎల్లో మీడియా..!

కొత్త ఎన్నికల కమిషనర్‌ను తెరపైకి తెచ్చిన ఎల్లో మీడియా..!

రాష్ట్రంలో గత రెండు నెలలుగా ఎన్నికల కమిషనర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే కోర్టులు..కేసులు..ఆదేశాలు..తీర్పులు ఇలా అన్ని స్థాయిల్లో ఇదే అంశంపై చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మద్దతుగా నిలిచిన ఎల్లో మీడియా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పుంకాలు పుంకాలుగా కథనాలు రాస్తుంది. టీవీల్లో ప్రచారం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా…ప్రతిపక్ష టిడిపికి అనుకూలంగా ఇలాంటి కథనాలు రాయడంలో ఎల్లో మీడియాకు మరెవ్వరూ తీసిపోరు.

ఈ సందర్భంగా రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్ ను తెరపైకి తీసుకొచ్చింది. తమకు తాము ఊహించుకొని కథనాలు రాసేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమించాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్న జగన్‌ ప్రభుత్వం.. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ ఇప్పటికే సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసిందని ఎల్లో మీడియా పేర్కొంది. వాస్తవానికి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించడం సర్వ సాధారణం. గత చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇలానే సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

రమేశ్‌ కుమార్‌ మళ్లీ కమిషనర్‌ కుర్చీలో కూర్చోకుండా అడ్డుకునేందుకే ఈ వ్యూహం రచిస్తోందని, కొత్త కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌సింగ్‌ను నియమించేలా కసరత్తు చేస్తోందని ఎల్లో మీడియా రాసేసింది. ప్రభుత్వంలోని వారికే తెలియని ఈ అంశాన్ని ఎలా రాసిందో తెలియదు గాని…రాష్ట్రానికి మరో ఎన్నికల కమిషనర్ ను ప్రకటించింది.

మరోవైపు కమిషనర్‌గా నియమించిన జస్టిస్‌ కనగరాజ్‌ కూడా హైకోర్టు తీర్పుతో పదవిని కోల్పోయారు. దీంతో కమిషనర్‌ పోస్టు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోందంటా, అయితే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండడం, రాజ్యాంగబద్ధమైన పదవి ఖాళీగా ఉండకూడదన్న నియమాలను అనుసరించి.. వీరిద్దరూ కాకుండా మూడో వ్యక్తిని కమిషనర్‌గా నియమించే యోచనలో ఉందంటా, మన్మోహన్‌సింగ్‌ను కొత్త ఎన్నికల కమిషనర్‌గా నియమించడానికి కసరత్తు మొదలైందంటా అని ఎల్లో మీడియా కథనం రాసిసింది. 

అయితే నిమ్మగడ్డ విషయం కోర్టులో ఉంది. దానిపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎల్లో మీడియా తాజాగా మరో ఎన్నికల కమిషనర్ ను తెరపైకి తెచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి