iDreamPost

అమ్ముడుపోని లాటరీ టికెట్.. అతడ్ని కోటీశ్వరుడ్ని చేసింది..

అమ్ముడుపోని లాటరీ టికెట్.. అతడ్ని కోటీశ్వరుడ్ని చేసింది..

పక్కనే అదృష్టం ఉన్నా పట్టించుకోలేదు. కానీ జాక్ పాట్ కొట్టి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. సామాన్యుడు కోటి రూపాయలకు అధిపతి అయ్యాడు. ఈయన్ను చూస్తుంటే అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది, దరిద్రం తలుపు తీసే వరకు కొడుతుందన్న సామెత గుర్తుకు వస్తుంది. ఎందుకంటే.. అదృష్టం వచ్చినప్పుడు చటుక్కున పట్టుకుంటేనే నిలుస్తుంది. అదే జరిగింది అతడి విషయంలో. జీవితంలో ఏం సాధించలేదని, ఏదో ఒకలా బతికేద్దామని బతుకు ఈడుస్తున్న సమయంలో లాటరీ రూపంలో ఒక్కసారిగా అదృష్టం వరించింది. అదీ కూడా అమ్ముడుపోని లాటరీకి అంత డబ్బులు రావడాన్ని ఏమంటారు లక్కీ అనే కదా. ఇంతకు ఆ లక్కీ పర్సన్‌ది ఎక్కడంటే కేరళ. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎస్కే గంగాధరన్ అనే వ్యక్తి 33 సంవత్సరాల పాటు కండక్టర్‌గా పని చేశారు. అయితే ఆ తర్వాత ఓ లాటరీ దుకాణాన్ని ఏర్పాటు చేసి.. వాటిని అమ్ముతూ కాలం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఫిఫ్టీ ఫిఫ్టీ లాటరీలో అతడు జాక్ పాట్ కొట్టాడు. ఏకంగా కోటీ రూపాయలు గెలుచుకున్నారు. అయితే తన షాపులో కొన్న టికెట్లలో అతడి వద్ద ఉన్న టికెట్టే మొదటి జాక్ పాట్ కొట్టడం ఆశ్చర్యకరం. తన వద్ద అమ్ముడుపోకుండా ఉండిపోయిన లాటరీకే ఆ కోటి రూపాలు వచ్చాయి. మరో ట్విస్ట్ ఏంటంటే.. అదే డ్రాలో గంగాధరన్ స్టోర్ నుండి టికెట్లు కొనుగోలు చేసిన మరో ఆరుగురు కూడా ఒక్కొక్కరు రూ. 5వేల గెలుచుకున్నారు. దీంతో తనతో పాటు తాను అమ్మిన వారికి కూడా డబ్బులు గెలుచుకోవడంతో అతడు ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నాడు. అలాగు బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి కూడా అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో 20 మిలియన్ దిర్హామ్స్ అనగా రూ. 44 కోట్లు నగదును గెలిచాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి