iDreamPost

దేవుడి ప్రసాదాలను అక్కడి భక్తులు లూటీ చేస్తారు! ఎందుకంటే..

మన దేశంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో విచిత్రమైన సంప్రదాయాలు ఉన్నాయి. తాజాగా ఓ ప్రాంతంలో దేవుడి ప్రసాదాన్ని భక్తులు లూటీ చేస్తారు. అందుకు గల కారణం ఏమిటంటే..

మన దేశంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో విచిత్రమైన సంప్రదాయాలు ఉన్నాయి. తాజాగా ఓ ప్రాంతంలో దేవుడి ప్రసాదాన్ని భక్తులు లూటీ చేస్తారు. అందుకు గల కారణం ఏమిటంటే..

దేవుడి ప్రసాదాలను అక్కడి భక్తులు లూటీ  చేస్తారు! ఎందుకంటే..

నిత్యం ఎంతో మంది ఇంట్లో పూజలు చేస్తుంటారు. మరికొందరు అయితే తరచూ దేవాలయాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఇలా పుణ్యక్షేత్రాలను, వివిధ ఆలయాలను దర్శించుకున్నప్పుడు కానుకలు సమర్పిస్తారు. ఇక స్వామి వారి దర్శనం అనంతరం అక్కడ ఇచ్చే తీర్థ, ప్రసాదాలను భక్తులు స్వీకరిస్తుంటారు. అయితే కొన్ని దేవాలయాల్లో విచిత్రమైన ఘటనలు జరుగుతుంటాయి. ఓ దేవాలయంలో దేవుడి ప్రసాదాలను అక్కడి భక్తులు లూటీ చేస్తారంట. అయితే అందుకు వారు చెప్పిన కారణం చాలా విచిత్రంగా ఉంది. మరి.. ఆ  దేవాలయం ఎక్కడ, ఆవివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్ సమంద్  అనే ప్రాంతంలో శ్రీనాథ్ జీ అనే ఆలయం ఉంది. ఇక్కడికి నిత్యం ఎంతో మంది భక్తులు వస్తుంటారు. అలానే ఇక్కడ అన్నకూట్ అనే పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగను గత  350 ఏళ్లుగా ఇక్కడి వారు సంప్రదాయంగా జరుపుకుంటున్నారు.  అన్నకూట్ పండుగను రాజ్ సమంద్ ప్రాంత ప్రజలు దీపావళి  పండగ తరువాత రోజున ఘనంగా నిర్వహించుకుంటారు. ఇక్కడ శ్రీనాథ్ జీ, విఠల్ నాథ్ జీ లాలన్ కు భక్తులు వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తుంటారు. అనంతరం స్వామి వారి సన్నిధిలో రోజంత కుటుంబంతో కలిసి గడుపుతారు. భజనలు, భక్తి గీతాలతో ఆ ఆలయం మారుమోగిపోతుంది. ఇక భక్తులు సమర్పించిన నైవేద్యాలను  రాత్రి 11 గంటల సమయంలో గిరిజనలు వచ్చి దోచుకుంటారు. ఈ నైవేద్యాలను తీసుకుంటే సమస్త రోగాలు నయమవుతాయని గిరిజనులు నమ్ముతారంట.

ఇలా విచిత్రమైన సంప్రదాయాలు కలిగిన అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇప్పటికే అలాంటి వింత సంప్రదాయాలు కలిగిన దేవాలయాలు చాలా ఉన్నాయి. పురుషులు ఆడవాళ్ల వేషాలు దర్శించి..స్వామి వారికి మొక్కులు దర్శించుకుంటారు. అలానే స్వామికి మద్యాన్ని నైవేద్యాంగా ఇస్తుంటారు. మరో దేవాలయంలో అయితే గడియాలను స్వామికి మొక్కులుగా చెల్లిస్తుంటారు.  ఇలా మన దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇలా విచిత్రమైన సంప్రదాయాలు కలిగిన దేవాలయాలు అనేకం ఉన్నాయి. మరి.. ప్రసాదాన్ని లూటీ చేయడం అనే వింత సంప్రదాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి