iDreamPost

టీచర్లను నియమించాలంటూ స్కూల్ ముందు ఆందోళనకు దిగిన విద్యార్థులు

టీచర్లను నియమించాలంటూ స్కూల్ ముందు 10వ తరగతి విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

టీచర్లను నియమించాలంటూ స్కూల్ ముందు 10వ తరగతి విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

టీచర్లను నియమించాలంటూ స్కూల్ ముందు ఆందోళనకు దిగిన విద్యార్థులు

ఈ ఏడాది సంవత్సరం దాదాపు పూర్తి కావొస్తున్నా ఇంతకు విద్యార్థులకు టీచర్లు లేరు. దీంతో పరీక్షలు రాసేదెలా అంటూ స్టూడెంట్స్ ఖంగారు పడుతున్నారు. స్కూల్లో టీచర్లు లేక ఆ విద్యార్థులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఇక చేసేదేం లేక విద్యార్థులు అంతా ఏకమై పాఠశాల ముందు ఏకంగా ఆందోళనకు దిగారు. మాకు అర్జెంట్ గా టీచర్లను నియమించాలంటూ స్టూడెంట్స్ నినాదాలు చేశారు. ఇదే అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. విద్యా సంవత్సరం పూర్తి కావొస్తున్నా విద్యార్థులకు పాఠాలు బోధించకపోవడానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం కేంద్రంలో ఉన్న మోడల్ స్కూల్ లో టీచర్లు లేక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే, విద్యా సంవత్సరం దాదాపు పూర్తి కావొస్తున్నా.. ఇప్పటి వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ టీచర్లు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక పరీక్షలు కూడా దగ్గర పడుతుండడంతో ఏం చేయాలో తెలియక విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో 10వ తరగతి స్టూడెంట్స్ అంతా మంగళవారం స్కూల్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. విద్యా సంవత్సరం పూర్తి కావొస్తున్నా ఆ సబ్జెక్ట్ లపై మాకు ఎలాంటి అవగాహన లేదని, అసలు మేము పరీక్షలు ఎలా రాయాలని ప్రశ్నిస్తున్నారు. వెంటనే మాకు ఫిజిక్స్, కెమిస్ట్రీ టీచర్లను నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. ఈ అంశంపై ఎస్ఎమ్ సీ ఛైర్మన్ శ్రీనివాస్ ఆ విద్యార్థులకు మద్దతు పలికారు. ఇప్పటికే చాలా సార్లు టీచర్ల నియామకం గురించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశామని, కానీ ఎవరూ ఇంత వరకు స్పందించిన పాపన పోలేదని స్కూల్ ప్రిన్సిపాల్ లావణ్య తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో కాస్త వైరల్ గా మారుతున్నాయి. స్కూల్లో వెంటనే ఫిజిక్స్, కెమిస్ట్రీ టీచర్లను నియమించాలని ఆందోళనకు దిగి పోరాడుతున్న విద్యార్థుల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి