iDreamPost

ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడంటే?

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులకు విద్యాశాఖ ఫలితాలపై కీలక అప్ డేట్ ఇచ్చింది. ఇంటర్ ఫలితాల విడుదల తేదీని అధికారికంగా రిలీజ్ చేసింది.

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులకు విద్యాశాఖ ఫలితాలపై కీలక అప్ డేట్ ఇచ్చింది. ఇంటర్ ఫలితాల విడుదల తేదీని అధికారికంగా రిలీజ్ చేసింది.

ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడంటే?

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు పరీక్షల ఫలితాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు రిజల్స్ట్ విడుదలవుతాయా అని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, టీచర్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఇంటర్ ఫలితాలను రిలీజ్ చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. తాజాగా ఇంటర్‌ ఫలితాల విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు అధికారులు. ఇంటర్‌ పరీక్షల ఫలితాలు ఏప్రిల్‌ 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన సంగతి తెలిసిందే. మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం బుధవారం నాడు ఉదయం 11 గంటలకు తెలియనున్నది. ఫలితాల విడుదల నేపథ్యంలో గతంలో చోటుచేసుకున్న తప్పిదాలు మరలా పునరావృతం కాకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీససుకుంటున్నారు. ఆన్‌లైన్ లో మార్కుల నమోదుతో పాటు సాంకేతికపరమైన సమస్యలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అంతకంటే 15 రోజుల ముందుగానే ఇంటర్ ఫలితాలను ప్రకటించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇంటర్ ఫలితాల అనంతరం పదో తరగతి ఫలితాలను కూడా విడుదల చేసేందుకు విద్యాశాఖ రెడీ అవుతోంది. త్వరలోనే టెన్త్ రిజల్ట్స్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పటికే ఇంటర్ ఫలితాలను విడుదల చేసింది అక్కడి విద్యాశాఖ. పదో తరగతి ఫలితాల విడుదల తేదీని (ఏప్రిల్ 22) కూడా అధికారికంగా ప్రకటించింది. ఫలితాల విడుదల నేపథ్యంలో విద్యార్థులు కొంత ఒత్తిడికి గురవుతుంటారు. కాబట్టి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి