iDreamPost

టీచర్‌పై కలెక్టర్‌కు కంప్లైంట్‌ చేసిన స్టూడెంట్స్‌.. సహకరించిన హెడ్మాస్టర్‌

గురువును మించిన దైవం లేదని అంటారు పెద్దలు. వారి దగ్గర పాఠాలు నేర్చుకుని, జీవితానికి సోపానాలు వేసుకుంటారు విద్యార్థులు. కానీ పాఠాలు చెప్పే టీచరే.. విద్యార్థుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తే.. వారి లైఫ్ నాశనం అయిపోతుంది.

గురువును మించిన దైవం లేదని అంటారు పెద్దలు. వారి దగ్గర పాఠాలు నేర్చుకుని, జీవితానికి సోపానాలు వేసుకుంటారు విద్యార్థులు. కానీ పాఠాలు చెప్పే టీచరే.. విద్యార్థుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తే.. వారి లైఫ్ నాశనం అయిపోతుంది.

టీచర్‌పై కలెక్టర్‌కు కంప్లైంట్‌ చేసిన స్టూడెంట్స్‌.. సహకరించిన హెడ్మాస్టర్‌

’గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరహ, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమహ‘ అనే శ్లోకం ఉంది. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు ఏదో ఒక పాఠం నేర్చుకుంటూనే ఉన్నారు. కానీ అజ్ఞానాన్నితొలగించి అతడిని/ఆమెని ప్రయోజకుడిని చేసేది గురువే. అందుకే గురువును దైవంతో సమానంగా కొలుస్తారు. గురు అనే పదానికి ఓ అర్థం ఉంది. గు అంటే చీకటి, రు అంటే తొలగించు అని అర్థం. గురువు అంటే విద్యా బుద్దులు నేర్పడమే కాదూ.. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎలా తట్టుకొని నిలవాలో, గెలవాలో ఉపదేశిస్తాడు. తప్పు చేస్తే మందలిస్తాడు. కానీ ఈ రోజుల్లో ఉపాధ్యాయులు అంటే కేవలం జీతం తీసుకుని, పాఠాలు చెప్పే పంతుళ్లుగా మారిపోయారు.

ఎందుకంటే గతంలో మందలిస్తే.. మా వాడి మంచి కోసమే చెప్పారని తల్లిదండ్రులు వదిలేసేవారు. కానీ ఇప్పుడు విద్యార్థులను కసిరినా, కన్నెర్ర చేసినా.. ఆ ఉపాధ్యాయులపైకి గొడవకు వచ్చేస్తున్నారు. అంత వరకు ఎందుకు.. పిల్లలే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదులు చేసిన ఘటనలు ఉన్నాయి. అలా అని విద్యార్థులది, ఆ తల్లిదండ్రులదీ తప్పు అనలేం. గురువుల్లో అందరూ మంచి వాళ్లున్నారని చెప్పలేం. తాజాగా ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన గురుకుల పాఠశాలలోని పలువురు విద్యార్థులు.. ఓ ఉపాధ్యాయుడిపై ఏకంగా జిల్లా కలెక్టర్‌కే కంప్లైంట్ చేశారు. అయితే వీరికి హెడ్ మాస్టార్ మద్దతుగా నిలవడం గమనార్హం. ఆమె స్వయంగా వారిని కలెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్లారు.

ఇంతకు ఏమైందంటే.. చిలుకలూరి పేటలోని రాజా పేట గురుకుల పాఠశాలలో బండ్ల అశోక్ పీఈటీ‌గా పని చేస్తున్నారు. తమను టార్గెట్ చేస్తూ.. అశోక్ విచక్షణ రహితంగా కొడుతున్నారంటూ విద్యార్థులు హెడ్మాస్టర్‌కు ఫిర్యాదు చేశారు.అయినా వేధింపులు ఆగకపోగా.. మరింత ఎక్కువయ్యాయి. దీంతో స్కూల్ హెడ్మాస్టర్ ఉషారాణి, ఎంఈవో లక్ష్మి, ఎంపీడీవో శ్రీనివాసరావులతో కలిసి పల్నాడ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు విద్యార్థులు. కలెక్టర్ శివశంకర్‌ని కలిసి తమ గోడును వెలిబుచ్చారు. సుమారు 50 మంది విద్యార్థులను పీఈటీ చితబాదుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఒంటిపై ఉన్న గాయాలను కలెక్టర్ చూపించారు స్టూడెంట్స్. దీంతో పీఈటీపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే పాఠశాలలో ఉన్న సమస్యల గురించి కూడా విన్నవించగా.. వాటిని పరిష్కరించాలని విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి