iDreamPost

కోడలి మీద అనుమానంతో DNA టెస్ట్.. చివరికి అత్త బుక్ అయ్యింది!

  • Published Apr 12, 2024 | 6:45 PMUpdated Apr 12, 2024 | 6:45 PM

తాజాగా కోడలి పై ఉన్న అనుమానంతో ఆమె బండరాన్ని బయట పెడదమనుకున్న ఓ అత్త చివరికి తానే ఊహించని చిక్కుల్లో ఇరుక్కుంది. దీంతో ఆ అత్త చేసిన చెత్త పనిని ఆ కోడలు నెట్టింట పోస్ట్ పెడుతూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిదంటే..

తాజాగా కోడలి పై ఉన్న అనుమానంతో ఆమె బండరాన్ని బయట పెడదమనుకున్న ఓ అత్త చివరికి తానే ఊహించని చిక్కుల్లో ఇరుక్కుంది. దీంతో ఆ అత్త చేసిన చెత్త పనిని ఆ కోడలు నెట్టింట పోస్ట్ పెడుతూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిదంటే..

  • Published Apr 12, 2024 | 6:45 PMUpdated Apr 12, 2024 | 6:45 PM
కోడలి మీద అనుమానంతో DNA  టెస్ట్.. చివరికి అత్త బుక్ అయ్యింది!

చెప్పేవి శ్రీరంగనీతులు – చేసేవి దొమ్మరి పనులు అని పెద్దలు ఊరికే అనలేదు. ఎందుకంటే.. మనం చేసివని ఎన్ని చెడ్డ పనులైనా.. ఎదుటవారికి మాత్రం నీతులు వల్లీస్తుంటాం. తాజాగా ఇప్పడు మనం చెప్పుకోబోయే ఉదంతం కూడా అలాంటిదే. కాకపోతే ఈ వ్యవహారంలో ఓ అత్త తన కోడలీ పై ఉన్న అనుమానంతో.. దోషించి కాస్త గడ్డి పెట్టాలనుకుంది. కానీ, చివరికీ తనే ఊహించని ఇబ్బందుల్లో పడింది. అయితే తన అత్త చేసిన చెత్త ఘనకార్యం వలన చివరికి ఆ కోడలి కాపురమే కూలిపోయే పరిస్థితికి వెళ్లిపోయింది. దీంతో ఆ కోడలు తన అత్త చేసిన నిర్వాకంకు నెట్టింట పోస్ట్ పెడుతూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిదంటే..

ఇటీవలూ ఒక విదేశీ యువతి ప్రసవించి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో.. ఇంటిళ్లపాది ఎంతో సంతోషించారు. కాగా, యువతి అత్త.. ఆస్పత్రిలో ఉన్న తన కోడలు, మనవడిని చూసేందుకు  వెళ్లింది. అయితే అక్కడ మనవడిని చూడగానే ఆమె ముఖంలో సంతోషంకు బదులు అనుమానం పెరిగిపోయింది. ఎందుకంటే.. ఆ బాబు కళ్ళు లేత ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. దీంతో ఆమెకు తన కోడలు ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుందని సందేహం వచ్చింది. దీంతో అప్పుడే తన కోడలికి డిఎన్ఏ టెస్ట్ చేయించాలని భావించింది. అప్పటి నుంచి ఇందులో భాగంగా తన కోడల్ని ప్రతిరోజూ వేధించడం మొదలుపెట్టింది.  ఇక ఈ విషయన్ని ఆ కోడలు తన భర్తకు చెబితే.. అతడు తన భార్యకు మద్దతుగా నిలిచాడు. పైగా ఈ విషయంలో..తన తల్లిని కూడా తిట్టాడు.  ఈ క్రమంలోనే.. తన భార్య తనను ఎప్పుడూ మోసం చేయదని.. లేనిపోని వివాదాలు సృష్టించొద్దని కాస్త గడ్డి పెట్టాడు.

DNA Test

అయితే కొడుకు గడ్డి పెట్టిన ఆ అత్తలో ఏమాత్రం మార్పు రాలేదు. మళ్లీ తన కోడల్ని మరింత వేధించడం మొదలుపెట్టింది.  దీంతో విసిగిపోయిన ఆ కోడలు అత్త పెట్టే వేధింపులు తట్టుకోలేక.. చివరికి డీఎన్ఏ టెస్టుకు అంగీకరించింది. ఈ క్రమంలోనే అత్త, కోడలు కలిసి డిఎన్ఏ టెస్ట్ కి వెళ్లారు. అయితే ఇక్కడే అసలు కథ మలుపు తిరిగింది. కాగా, కోడలు చేసిన వ్యవహారంను వెలుగులోకి తీసుకోద్దాం అనుకున్నా అత్తకు.. చివరికి ఆమె వయసులో ఉన్నప్పుడు చేసిన నిర్వాకం అనేది బయటపడింది. అసలు  ఆ డిఎన్ఏ పరీక్షల్లో తన మనవడి తండ్రి తన కొడుకే అయినప్పటికీ.. తన కొడుకు తండ్రి మాత్రం తన భర్త కాదని తేలిపోయింది. దీంతో ఆ అత్త ఒక్కసారిగా షాక్ కు గురైంది. కాగా, ఆమె మనవడి కంటి రంగు.. ఇతర కుటుంబ సభ్యులతో పోల్చితే భిన్నంగా ఉండడానికి కారణం అదే అని తెలిసి ఒక్కసారిగా నిర్ఘాంత పోయింది.

ఇక ఈ విషయాన్ని ఆ కోడలు నెట్టింట పంచుకుంది. అలాగే  డిఎన్ఏ టెస్ట్ లో తన అత్త  దొరికిపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని బాధపడింది. కాగా,  ఈ వ్యవహారం ద్వారా తన అసలు తండ్రి ఎవరో కనుక్కునేందుకు తన భర్త తెగ ప్రయత్నాలు చేస్తున్నాడని అని కూడా ఆ కోడలు వాపోయింది. అయితే ఆ కోడలు పెట్టిన పోస్ట్ చదివిన నెటిజన్లు.. ఆమె అత్తను తెగ విమర్శిస్తున్నారు. ఆమె భర్త చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని కోరుతున్నారు. ఎందుకంటే ఇలాంటి పని చేస్తే కుటుంబం మొత్తం నాశనమవుతుందని.. ఆ విషయాన్ని మర్చిపోవాలని సూచిస్తున్నారు. మరి, కోడలి వ్యవహారం బయటపెడదమని, తానే ఇబ్బందుల చిక్కుకున్న ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి