iDreamPost
android-app
ios-app

అసలు కల్ట్ మామ ‘ది సందీప్ రెడ్డి వంగా’! యానిమల్ తో మరోసారి..

  • Author ajaykrishna Published - 04:27 PM, Thu - 28 September 23
  • Author ajaykrishna Published - 04:27 PM, Thu - 28 September 23
అసలు కల్ట్ మామ ‘ది సందీప్ రెడ్డి వంగా’! యానిమల్ తో మరోసారి..

ఇండస్ట్రీలో ఐకానిక్ సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ. వాళ్ళు తీసేవి ఒకటి రెండు సినిమాలైనా.. లేదా చాలా గ్యాప్ తీసుకొని తక్కువ సినిమాలు తీసినా అలా ఉండిపోతాయి. అలాంటి సినిమాలు అందరికి కాకపోయినా కొన్ని వర్గాలకైనా ఆల్ టైమ్ ఫేవరేట్ అవుతుంటాయి. అలాంటి సినిమాలలో అర్జున్ రెడ్డి ఒకటి. డెబ్యూ డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమా.. ఆరేళ్ళ క్రితం థియేటర్స్ లో విడుదలై సంచలన విజయం సాధించింది. సరే.. ముందుగా వివాదాలు క్రియేట్ చేసినప్పటికీ.. ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ అంతా సినిమాకే ఓటు వేశారు. సినిమా కల్ట్ ఫిల్మ్ గా నమోదు అయ్యింది.

కట్ చేస్తే.. అదే అర్జున్ రెడ్డి సినిమాని బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేశాడు సందీప్. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఆ సినిమా.. తెలుగులో కంటే పెద్ద విజయం సాధించింది. కలెక్షన్స్ పరంగాను షాహిద్ కెరీర్ లో ది బెస్ట్ ఇచ్చింది. ఓవర్ నైట్ లో సందీప్ ని స్టార్ డైరెక్టర్ చేసేసింది. కట్ చేస్తే.. బాలీవుడ్ నుండి సందీప్ కి ఊహించని రేంజ్ లో ఆఫర్స్ క్యూ కట్టాయి. వాటిలో ఒకటి ఇప్పుడు రూపొందిస్తున్న యానిమల్. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా.. డిసెంబర్ 1న రిలీజ్ అవుతోంది. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ నుండి పోస్టర్స్, ప్రోమోలతో అంచనాలు పెంచిన సందీప్.. టీజర్ తో మళ్ళీ ప్రూవ్ చేశాడు.

యానిమల్.. ఖచ్చితంగా రెగ్యులర్ గా ఉండే సినిమా అయితే కాదని అర్ధమవుతుంది. బట్.. ఇది కూడా అర్జున్ రెడ్డి లాగా క్యారెక్టర్ మీద బేస్ అయ్యే స్క్రీన్ ప్లేతో సాగుతుంది. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది అన్నట్లు.. సందీప్ అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ స్టోరీతో ప్రూవ్ చేసుకున్నాడు. తాను రెగ్యులర్ రొట్టకొట్టుడు సినిమాలైతే తీయడు అని. యానిమల్ లో తండ్రి కోసం రక్తపాతం చిందించే కొడుకు క్యారెక్టర్ లో హీరో కూల్ అండ్ కిరాతకంగా కనిపిస్తున్నాడు. అంటే.. అతన్ని అంత పీక్స్ కి తీసుకెళ్లే ఎమోషన్ ఏదో బలంగా ఉండే ఉంటుంది. సో.. అదేంటో తెలియాలంటే డిసెంబర్ 1 వరకు వెయిట్ చేయాల్సిందే. యానిమల్ టీజర్ తో సందీప్ కల్ట్ డైరెక్టర్ అనిపించుకున్నాడని ఆడియన్స్ కితాబులిచ్చేస్తున్నారు. మరి ది సందీప్ రెడ్డి వంగా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

gamdomCasibommarsbahis girişMarsbahisJojobet Girişjojobetjojobet giriş