iDreamPost

Onion Price:భారీగా పడిపోయిన ఉల్లి ధర.. కిలో రూ.3 అమ్మకం

  • Published Feb 01, 2024 | 11:34 AMUpdated Feb 01, 2024 | 12:33 PM

మొన్నటి వరకు ఉల్లి ధర ఆకాశానికి తాకుతూ ప్రజలకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఉల్లి ధర తగ్గిపోవడంతో రైతుల కంట కన్నీరు పెట్టిస్తుంది. ఇంతకి ఎంత తగ్గిందంటే..

మొన్నటి వరకు ఉల్లి ధర ఆకాశానికి తాకుతూ ప్రజలకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఉల్లి ధర తగ్గిపోవడంతో రైతుల కంట కన్నీరు పెట్టిస్తుంది. ఇంతకి ఎంత తగ్గిందంటే..

  • Published Feb 01, 2024 | 11:34 AMUpdated Feb 01, 2024 | 12:33 PM
Onion Price:భారీగా పడిపోయిన ఉల్లి ధర.. కిలో రూ.3 అమ్మకం

ఇటీవలే రాష్ట్రంలో ఉల్లి ధర ఆకాశాన్ని తాకడంతో సామాన్య ప్రజలు భయాందోళనకు గురైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఈ ఉల్లి ధర పడిపోవడంతో రైతు కంట కన్నీరు పెట్టిస్తుంది. దీంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కనీసం లాభాలు రాకపోవడం లేదు కదా, దిగుమతులకు అయ్యే ఖర్చులు కూడా రావడం లేదంటూ వాపోతున్నారు. వాస్తవంగా కొన్ని నెలల వరకు ఉల్లి పంట మంచి దిగుబడి ఉండటంతో పాటు.. మార్కెట్ లో ధర కూడా బాగా పలికింది. దీంతో మార్కెట్ లో ఉల్లి డిమాండ్ పెరగడంతో.. రైతులకు కూడా ఉల్లి మంచి గిట్టుబాటు అయ్యి లాభాలను ఆర్జించేవారు. కానీ, ఇప్పుడు అకస్మాత్తుగా ఉల్లి ధర రూ.2 పడిపోవడంతో.. రైతులు బోరుమని విలపిస్తున్నారు. ఇంతకి అది ఎక్కడంటే..

మొన్నటి వరకు ఉల్లి ధర భారీగా పెరిగి ప్రజలను ఏడిపించిన విషయం తెలసిందే. ఇప్పుడు అదే ఉల్లి ధర భారీగా పడిపోవడంతో రైతు కంట కన్నీరు పెట్టిస్తుంది. కనీసం పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. ఎంతో కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి మార్కెట్ లో సరైన ధర లేకపోవడంతో అన్నదాతలు లబోదిబో మంటున్నారు. తాజాగా కర్ణాటకలోని దావణగెరె జిల్లాకు చెందిన రైతులు ఉల్లిని అధికంగా పండించగా.. వాటిని విక్రయించేందుకు ఏపీఎంసీ మార్కెట్‌కు తరలివచ్చారు. అక్కడ ఒక్కరోజే ఆరువేల బస్తాల ఉల్లి మార్కెట్‌కు రావడంతో పాటు.. కిలో ఉల్లి ధర రూ.3-4 వరకు పలికింది. దీంతో రైతులు ఒక్కసారిగా ఆందోళనకు గురైయ్యారు.

onion kg 3rs

కనీసం ఉల్లి అమ్మితే లారీ అద్దె వచ్చినా చాలు అంటూ వాపోతున్నారు. అలాగే గత రెండు మూడు రోజులుగా ధర పెరుగుతుందని రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఇప్పుడు ఉల్లి ధర క్వింటాల్‌కు 1500 రూపాయలు. ఉత్తమ దత్త ఉల్లిపాయ ధర రూ. 1200 నుంచి రూ. 1400 ఉంది. ఎగువ మందం రూ. 1000 నుంచి రూ. 1100 ఉంది. మీడియం సైజు ఉల్లి ధర రూ. 700 నుంచి రూ. 800 ఉండగా.. చిన్న సైజు ఉల్లి ధర రూ. 300 నుంచి రూ. 400 ఉంది. ఇప్పటికే తీవ్ర కరువులో ఉన్నా రైతులు ఎంతో కష్టపడి ఉల్లిని సాగు చేస్తే మంచి ధర లభిస్తుందని ఆశ పడ్డారు. కానీ,  ఇలా ఒక్కసారిగా ఉల్లి ధర తగ్గడంతో.. రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మార్కెట్ లో ఆశించిన స్థాయిలో కొనుగోలు జరగడంలేదనే నేపథ్యంలో రైతులు గ్రామాల్లో ఉల్లిని విక్రయించేందుకు వెళ్తున్నారు. మరి, ఉల్లి ధర ఒక్కసారిగా తగ్గపోవడంతో కన్నీరు పెట్టుకుంటున్న రైతుల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి