iDreamPost

Kalyan Jewellers: కళ్యాణ్ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు.. ముగ్గురికి గాయాలు

  • Published May 03, 2024 | 10:08 AMUpdated May 03, 2024 | 10:08 AM

ప్రముఖ ఆభరణాల సంస్థ కళ్యాణ్‌ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు సంభవించింది. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ వివారలు..

ప్రముఖ ఆభరణాల సంస్థ కళ్యాణ్‌ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు సంభవించింది. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ వివారలు..

  • Published May 03, 2024 | 10:08 AMUpdated May 03, 2024 | 10:08 AM
Kalyan Jewellers: కళ్యాణ్ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు.. ముగ్గురికి గాయాలు

వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. నిత్యం రోజు ఎక్కడో ఓ చోట ఫైర్‌ యాక్సిడెంట్‌ సంభవించింది అనే వార్తలు వింటూ ఉంటాం. మిగతా కాలాలతో పోలిస్తే.. వేసివిలో చిన్న నిప్పు రవ్వ కూడా భారీ ప్రమాదాలకు కారణం అవుతుంది. అందుకు కారణం గాలిలో తేమ లేకపోవడం. దాంతో చిన్న నిప్పు కణిక కూడా భారీ అగ్ని ప్రమాదాలను రాజేస్తుంది. దాంతో పాటు షార్ట్‌ సర్క్యూట్‌ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కొన్ని రోజుల క్రితం షాద్‌ నగర్‌ ఫార్మ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఇదిలా ఉండగా.. తాజాగా కళ్యాణ్‌ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు సంభవించింది. ఆ వివరాలు..

ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ కళ్యాణ్‌ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు సంభవించింది. అయితే ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదు. కర్ణాటకలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బళ్లారిలోని కళ్యాణ్ జ్యువెలర్స్‌లో బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏసీలో రిపేర్‌ కారణంగా.. ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఇక పేలుడు గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులకు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదానికి గల కారణాలు విచారించే పనిలో ఉన్నారు. రాత్రి సమయం కావడంతో పెద్దగా కస్టమర్లు లేరని తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి