iDreamPost

అడవిలో కుప్ప కూలిన విమానం.. 14 మంది ప్రయాణికులు మృతి!

అడవిలో కుప్ప కూలిన విమానం.. 14 మంది ప్రయాణికులు మృతి!

బ్రెజిల్ లో దారుణం చోటు చేసుకుంది. అడవిలో విమానం కూలి ఏకంగా 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మౌనోస్ ఎయిర్ టాక్సీ అనే ఎయిర్ లైన్ సంస్థ టూరిస్టులకు ఈ విమానాలను అద్దెకు ఇస్తుంది. అయితే EMB-110 చెందిన ఈ విమానంలో తాజాగా ఉత్తర అమెజాన్ ప్రావిన్సులు బార్సిలోస్ కు 18 మంది ప్రయాణికులతో బయలుదేరింది. అయితే వీరి విమానం మనౌస్ సిటీ నుంచి మార్సిలోస్ కు వెళ్లింది. కాగా, 90 నిమిషాల వ్యవధిలోనే ఉన్నట్టుండి ఈ విమానం అమెజాన్ అడవుల్లో ఒక్కసారిగా కుప్పకూలింది.

ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులతో పాటు మరో ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అప్రతమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంతటా పరిశీలించారు. ఆ తర్వాత మృతదేహాలను బయటకు తీశారు. దీంతో పాటు మిగతా అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో నిమిగ్నమయ్యారు.

కూలిన సమయంలో విమానంలో ఏం జరిగింది? ఏమైన సాంకేతిక లోపం సంభవించిందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం.. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతులంతా స్పోర్ట్స్ ఫిషింగ్ కోసం బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. వీరి మరణవార్త తెలుసుకుని వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

  • ఇది కూడా చదవండి: జిమ్ చేస్తూ గుండెపోటుతో చనిపోయిన 19 ఏళ్ల కుర్రాడు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి