iDreamPost

బస్సు కిటికీలో తల ఇరుక్కపోయి.. నరకం చూసిన ప్రయాణికుడు

బస్సు ప్రయాణం సురక్షితం, శుభప్రదం అని ఆర్టీసీ బస్సుల్లో స్లోగన్ చూసే ఉంటారు. ఇదే నమ్మకంతో చాలా మంది కూడా ఎక్కడకైనా వెళ్లాలంటే బస్సునే ఆశ్రయిస్తుంటారు. కానీ అదే బస్సు ఎక్కి పిచ్చి పిచ్చి పనులు చేసి వార్తల్లో నిలుస్తుంటారు కొందరు.

బస్సు ప్రయాణం సురక్షితం, శుభప్రదం అని ఆర్టీసీ బస్సుల్లో స్లోగన్ చూసే ఉంటారు. ఇదే నమ్మకంతో చాలా మంది కూడా ఎక్కడకైనా వెళ్లాలంటే బస్సునే ఆశ్రయిస్తుంటారు. కానీ అదే బస్సు ఎక్కి పిచ్చి పిచ్చి పనులు చేసి వార్తల్లో నిలుస్తుంటారు కొందరు.

బస్సు కిటికీలో తల ఇరుక్కపోయి.. నరకం చూసిన ప్రయాణికుడు

ఉద్యోగానికైనా, మార్కెట్‌కు వెళ్లాలన్నా, ఇతర అవసరాల నిమిత్తం బయటకు వెళ్లేందుకు, దూర ప్రయాణాలు చేయాలన్నా ఎక్కువగా వినియోగించే వాహన సాధనం బస్సు. చాలా మంది బస్సు ప్రయాణం సేఫ్టీ అని నమ్ముతుంటారు. బస్సు రాగానే ఉరుకుల పరుగుల మీద ఎక్కుతుంటారు. విండో సీటు కోసం ఎగబడుతుంటారు. దూర ప్రయాణం చేసేవాళ్లుకు విండో సీట్ లభిస్తే.. తన అంతా అదృష్టవంతులు మరొకరు ఉండరని ఫీల్ అవుతుంటారు. ఆ సీటు దొరికితే అక్కడ సెటిల్ అయిపోతూ ఉంటారు. ఇక బస్సు ప్రపంచంతో సంబంధం ఉండదు. కనిపించి, కనిపించని బాహ్య ప్రపంచాన్ని బస్సులో నుండే ఆ కాస్తంత కిటికీ సంధులో నుండి చూసి.. ఆస్వాదిస్తుంటారు.

కొంత మంది ప్రయాణీకులు అయితే పిచ్చి పిచ్చి పనులు చేస్తూ.. తోటి ప్రయాణీకులతో తిట్లు తింటూ ఉంటారు. కిటీకిలో నుండి చేతులు బయటపెట్టడం.. అక్కడే తల ఆన్చి నిద్రపోవడం, ఉమ్ములు వేయడం, చేతులు కడగటం వంటి పనులు చేస్తుంటారు. దీని వల్ల ఇతర ప్రయాణీకులు ఇబ్బందులకు గురౌతుంటారు. బస్సులో డ్రైవర్, కండక్టర్లు కూడా వీరి పనులకు తలలు పట్టుకుంటారు. చేతులు, తలలు బయటపెట్టొద్దని పలుమార్లు చెబుతూనే ఉంటారు. అయినప్పటికీ వినిపించుకోకుండా ఇలాంటి పనులే చేస్తుంటారు కొందరు ప్రయాణీకులు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి కూడా అలాంటి ఓ తిక్క పని చేసి వార్తల్లో నిలిచాడు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బస్సులో ప్రయాణీస్తున్న సుందర్ రావు అనే వ్యక్తి తల బస్సు కిటికీ డోర్‌లో ఇరుక్కుపోయింది. సంతబొమ్మాలికి చెందిన అతడు.. బస్సు ఎక్కగా.. ఇందిరా గాంధీ జంక్షన్ వద్దకు రాగానే.. బస్సు విండోలో నుండి తల బయటకు పెట్టాడు. అంతే తిరిగి తలను లోపలకు తీసేందుకు ప్రయత్నించగా.. రాలేదు. 15 నిమిషాల పాటు గిలగిల కొట్టుకున్నాడు.. అయినా రాకపోవడంతో బస్సును నిలిపివేశాడు డ్రైవర్. స్థానికులు, తోటి ప్రయాణీకుల సాయంతో బలవంతంగా లాగగా ఎట్టకేలకు ప్రయాణీకుడు సురక్షితంగా బయటపడ్డాడు. దీంతో హమ్మయ్య అంటూ అతడు ఊపిరి పీల్చుకున్నాడు. ప్రాణాలు దక్కయిరా బాబు అంటూ సీటులో కూలబడ్డాడు. ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశమైంది. బస్సులో ప్రయాణీస్తున్నప్పుడు ఇలాంటి వింత అనుభవాలు ఎదుర్కొన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి