iDreamPost

రికార్డు! 10 ఏళ్ల పాటు షూటింగ్‌ చేసిన మూవీ.. రిలీజ్‌కు రెడీ

సాధారణంగా ఒక సినిమా రెండేళ్లు, గట్టిగా ఐదేళ్ల పాటు తెరకెక్కుతుందేమో బహుశా. కానీ ఈ చిత్రం 10 ఏళ్ల పాటు షూటిింగ్ జరుపుకుని రికార్డును సృష్టించింది. ఇన్ని సంవత్సరాలు మూవీ తెరకెక్కడానికి బడ్జెట్, ఇతర సమస్యలు అడ్డు కాలేదు. కానీ..

సాధారణంగా ఒక సినిమా రెండేళ్లు, గట్టిగా ఐదేళ్ల పాటు తెరకెక్కుతుందేమో బహుశా. కానీ ఈ చిత్రం 10 ఏళ్ల పాటు షూటిింగ్ జరుపుకుని రికార్డును సృష్టించింది. ఇన్ని సంవత్సరాలు మూవీ తెరకెక్కడానికి బడ్జెట్, ఇతర సమస్యలు అడ్డు కాలేదు. కానీ..

రికార్డు! 10 ఏళ్ల పాటు షూటింగ్‌ చేసిన మూవీ.. రిలీజ్‌కు రెడీ

ఒకప్పుడు సినిమాలు అత్యంత వేగంగా నిర్మించేవారు. అందుకే అప్పట్లో ఒక హీరో ఏడాదికి 8 నుండి 10 సినిమాలను విడుదల చేశారు. కానీ ఇప్పుడు కథ, అందుకు తగ్గ పాత్రల ఎంపిక, రిచ్ లొకేషన్లు, టెక్నాలజీ, బడ్జెట్ వెరసి సినిమాను పట్టాలు ఎక్కించేందుకే సంవత్సరాలు పడుతున్నాయి. ఇక వాటిని పూర్తి చేసేందుకు ఏళ్లు గడుస్తున్నాయి. బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టులు తెరకెక్కించేందుకు రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడికి ఐదేళ్లు పట్టింది. ప్రభాస్ కూడా ఈ మూవీపై కాన్సంట్రేట్ చేయడంతో మరో మూవీలో కనిపించలేదు. రిజల్ట్ పాజిటివ్‌గా వచ్చింది కానీ.. అదే అటు ఇటుగా అయితే.. కచ్చితంగా విమర్శలు పాలయ్యేది మూవీ. కానీ ఇప్పుడు ఓ మూవీ పదేళ్ల పాటు తెరకెక్కి ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది.

ఒక సినిమాను మహా అయితే సంవత్సరం లేదా బాహుబలిలా ఐదేళ్లు పాటు చిత్రీకరించడం చూశారు కానీ..ఈ మూవీని పదేళ్ల పాటు తెరకెక్కిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ బడ్జెట్, టెక్నీషియన్ల కొరత, ఇతర సమస్యలు ఉన్నాయనుకుంటున్నారేమో.. కాదు కథ డిమాండ్ బట్టి.. ఆ చిత్రం అనేళ్ల పాటు షూట్ చేసుకుంది. ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇంతకు ఆ మూవీ పేరేటంటే..మామరం. ఈ సినిమా హీరో ఎవరో కాదూ.. ఆనందం యాక్టర్ ఆకాష్. తెలుగులో పిలిస్తే పలుకుతా, హైటెక్ స్టూడెంట్.. వసంతం, ఆనందమానందమాయే, అందాల రాముడు, నవ వసంతం, గోరింటాకు, నమో వెంకటేశాయ వంటి చిత్రాల్లో నటించాడు. కానీ తెలుగులో అతడికి క్రేజ్ రాలేదు. దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి హీరోగా పేరు గడించారు.

one movie 10 years shooting

అతడి పేరు జై ఆకాష్ మార్చుకుని సినిమాలు చేశారు. ఆకాశ్ ఎ క్యూబ్ మూవీస్ అనే యాప్ ప్రారంభించి.. దీని ద్వారా తన సినిమాలే కాకుండా.. ఇతర హీరోల సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల హీరోగా నటించి, నిర్మించిన జై విజయం ఏ క్యూబ్ మూవీస్ యాప్‌లో విడుదలై మంచి ఆదరణ పొందింది. దర్శకుడిగా మారి పలు చిత్రాలను తెరకెక్కించాడు. అయితే 2012లో మొదలు పెట్టిన మామరం అనే మూవీ ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకోగా.. రిలీజ్ చేయబోతున్నాడు. ఈ మూవీలో బ్రహ్మానందం, కాదల్ సుకుమార్, రాహుల్ దేవ్ ముఖ్య పాత్రలు పోషించారు. కాగా, ఈ సినిమ ఆడియో లాంచ్, ట్రైలర్ ఆవిష్కరణ ఇటీవల చెన్నై కమలా థియేటర్లలో నిర్వహించారు.

ఈ సందర్భంగా మామరం చిత్రాన్ని 10 సంవత్సరాల పాటు తెరకెక్కించడానికి గల కారణాన్ని ఆయన వివరించారు. తన జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమని తెలిపారు. 2012లో షూటింగ్ స్టార్ చేశామని తెలిపారు. కథ డిమాండ్ కారణంగా ఇన్నేళ్లు షూటింగ్ చేసినట్లు వెల్లడించారు. ఇందులో తన పాత్ర 25 నుండి 40 ఏళ్ల వరకు వివిధ గెటప్స్‌లో కనిపించాల్సి ఉంటుందని.. సహజంగా కనిపించాలన్న ఉద్దేశంతో ఈ సినిమాను పదేళ్ల పాటు షూటింగ్ చేశామని చెప్పారు ఆకాష్. ప్రస్తుతం విడుదలకు రెడీ అవుతుంది. మరీ అతడు పడుతున్న కష్టానికి తగిన ప్రతి ఫలం లభిస్తుందా.. ఏమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి