iDreamPost

OTTలోకి వచ్చేసిన హర్రర్ హిట్.. ఒంటరిగా చూసే ధైర్యముందా?

  • Published Feb 08, 2024 | 4:11 PMUpdated Mar 14, 2024 | 4:50 PM

గత కొంతకాలంగా ఓటీటీలో విడుదల అయ్యే సినిమాలకు, వెబ్ సిరీస్ లకు ఆదరణ బాగా పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో హర్రర్ చిత్రాలపై అందరి ద్రుష్టి మళ్లుతుంది. అటువంటి ఓ హర్రర్ చిత్రాన్ని ఇప్పటివరకు మిస్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే.

గత కొంతకాలంగా ఓటీటీలో విడుదల అయ్యే సినిమాలకు, వెబ్ సిరీస్ లకు ఆదరణ బాగా పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో హర్రర్ చిత్రాలపై అందరి ద్రుష్టి మళ్లుతుంది. అటువంటి ఓ హర్రర్ చిత్రాన్ని ఇప్పటివరకు మిస్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే.

  • Published Feb 08, 2024 | 4:11 PMUpdated Mar 14, 2024 | 4:50 PM
OTTలోకి వచ్చేసిన హర్రర్ హిట్.. ఒంటరిగా చూసే ధైర్యముందా?

ప్రస్తుతం ఓటీటీలో విడుదల అయ్యే చిత్రాలపైనే అందరి దృష్ఠి. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో.. భాషతో, జోనర్ తో సంబంధం లేకుండా ప్రతి వారం పదుల సంఖ్యలో.. అనేక రకాల చిత్రాలు, సిరీస్ లు విడుదల అవుతూ ఉంటాయి. ఇలా విడుదల అవుతున్న సినిమాలలో ముఖ్యంగా ఆడియన్స్ క్రైమ్, సస్పెన్స్, హర్రర్ చిత్రాలు , సిరీస్ లు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాటిలో మరీ ముఖ్యంగా హర్రర్ చిత్రాలు చూసే ప్రేక్షకులే ఎక్కువ. దెయ్యాలంటే భయపడే వారు కూడా.. ఈ హర్రర్ చిత్రాలను చూడడం మాత్రం మానరు. ఆ రకంగా క్షణ క్షణం ఉత్కంఠ భరితంగా .. ప్రతి సీన్ ను చిత్రీకరిస్తూ.. ఆడియన్సుకు ఇంట్రెస్ట్ కలిగిస్తుంటారు మేకర్స్. అందుకే ఎక్కువ మంది భయపడుతూనైనా ఈ హర్రర్ ఫిల్మ్స్ ను చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో హాలీవుడ్ లో వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ నుంచి దెయ్యాల చిత్రాలు మరింత ఫేమస్. అయితే, ఇదే బ్యానర్ లో ఐదేళ్ల క్రితం వచ్చిన చిత్రం ‘ది నన్’.. దానికి సిక్వెల్ గా వచ్చిన చిత్రం ‘ది నన్2’ .. క్షణ క్షణం వెన్నులో వణుకు పుట్టించే ఈ హర్రర్ చిత్రాన్ని .. మిస్ అయితే మాత్రం వెంటనే చూడాల్సిందే.

ముఖ్యంగా హర్రర్ చిత్రాలంటే గుర్తొచ్చేది హాలీవుడ్ మూవీస్. వాటిలో ముఖ్యంగా ది కంజూరింగ్, అనాబెల్లె, ఈవిల్ డెడ్, లైట్స్ అవుట్ వంటి చిత్రాలకు.. ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాయి. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం వచ్చిన ఓ హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ “ది నన్”. 2018లో థియేటర్ లో విడుదల అయిన ఈ చిత్రం.. ప్రేక్షకులను గట్టిగా భ్యపెట్టడంతో పాటు.. బాక్స్ ఆఫీస్ వసూళ్లను కొల్లగొట్టింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా భయపెట్టిందో .. అదే రేంజ్ లో ఆకట్టుకుందని చెప్పి తీరాలి. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన ఐదేళ్ల తర్వాత ‘ది నన్’ సిక్వెల్ ‘ది నన్ 2’ ను రూపొందించారు మేకర్స్ .. గతేడాది అక్టోబర్ 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈమూవీ స్ట్రీమింగ్ అవుతుంది. కానీ ఇప్పుడు , మన దేశంలో ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో లోకి వచ్చేసింది. దెయ్యంగా మారిన ఓ అందమైన అమ్మాయి కథే “ది నన్-2”. అసలు ఆ అమ్మాయి దెయ్యంగా ఎందుకు మారింది? ఆమె కథేంటి ? అనే కథా సారాంశంతో సినిమా ఉంటుంది. అసలు దీనిని ఎందుకు మిస్ కాకుండా చూడాలి అంటే..

“ది నన్-2” సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీని ఫస్ట్ సిరీస్ తర్వాత నాలుగు సంవత్సరాలకు స్టార్ట్ అయినట్లు చూపిస్తారు. ఫ్రాన్స్ లో ఒక బోర్డింగ్ స్కూల్లో సిస్టర్ ఐరీన్.. మరోసారి వాలాక్ (నన్) అపవిత్రమైనటువంటి ఆత్మతో పోరాడాల్సి వస్తుంది. ఇందులో దీని వెనుక ఉన్న అసలు నేపథ్యం ఏమిటి.. తను అలా ఎందుకు శపించబడింది అనే రహస్యాలను లోతుగా పరిశీలించడమే కథ. క్షణ క్షణం ఉత్కంఠభరితంగా సాగే సన్నివేశాలకు.. యాడ్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో .. భయపడని ప్రేక్షకులు ఉండరు. ఎంత భయపడినా సరే.. తర్వాత ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీ అందరిని ఈ సినిమా మొత్తం చూసేలా చేస్తోంది. ఇక ప్రస్తుతం ఈ హర్రర్ చిత్రం ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియోలో ప్రసారం అవుతోంది. ఈ చిత్రం ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళంలో భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది. కాబట్టి థియేటర్ లో ఈ హర్రర్ చిత్రాన్ని మిస్ అయిన వారు .. ఖచ్చితంగా చూడాల్సిన చిత్రం ఇది. మరి, “ది నన్-2” చిత్రంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి