iDreamPost

ఈ చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్‌గా దేశాన్ని షేక్ చేసే సినిమాల్లో నటిస్తోంది!

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి.. పదో తరగతిలోనే డిసైడ్ అయ్యింది తాను హీరోయిన్ కావాలని. అందుకే 12వ తరగతి కాగానే.. చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. తాను అనుకున్నట్లుగా స్టార్ యాక్ట్రెస్ అయ్యింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి.. పదో తరగతిలోనే డిసైడ్ అయ్యింది తాను హీరోయిన్ కావాలని. అందుకే 12వ తరగతి కాగానే.. చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. తాను అనుకున్నట్లుగా స్టార్ యాక్ట్రెస్ అయ్యింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

ఈ చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్‌గా దేశాన్ని షేక్ చేసే సినిమాల్లో నటిస్తోంది!

ఇండస్ట్రీలోకి రావాలనుకున్న నటీమణులు..టిపికల్ అండ్ రిస్క్ పాత్రలతో ఎంట్రీ ఇవ్వాలని అనుకోరు. రొమాంటిక్ అండ్ గ్లామరస్ పాత్రల్లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లకు కెరీర్ ఫాస్ట్ గ్రోన్ అప్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది బ్యూటీస్ ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. కానీ ఈ ఫోటోలో ఉన్న చిన్నారి కాస్త స్పెషల్. రావడమే హార్రర్ చిత్రాల్లో నటించింది. సినిమా అంటే పిచ్చి .. ఫ్యాషన్. అందుకే పదో తరగతిలోనే హీరోయిన్ కావాలని అనుకున్న అమ్మడు అప్పట్లోనే స్టడీస్ మానేయాలనుకుంది. ఈ విషయాన్ని ఇంట్లో కూడా చెప్పింది. దీంతో ఖంగు తిన్న తల్లిదండ్రులు. ఇప్పుడు కాదూ.. పాఠశాల విద్యను పూర్తి చేయి.. ఆ తర్వాత నీకు ఇష్టమైన రంగంలో వెళ్లు అని నచ్చ చెప్పారు. దీంతో ఎగిరి గంతులేసిన బ్యూటీ.. 12 పూర్తి చేసి.. చదువు మానేసింది. కానీ ఆమెకు నాట్యం అంటే ఎనలేని ఇష్టం. అందుకే కథక్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

చిన్నప్పుడే చిరు నవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ చిన్నారి.. అనుకున్నట్లుగానే హీరోయిన్ అయ్యింది. అయితే చిత్ర పరిశ్రమలోకి ఎంటర్ అయ్యే సమయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఆమెను ఎంపిక చేయాలంటే.. అడ్డుగా నిలిచింది గింగిరాల జుట్టు.. చాలా యంగ్ బ్యూటీగా కనిపించడంతో చాలా అవకాశాలు రాలేదు. చివరకు ఓ హారర్ మూవీలో ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు.. దేశంలో చర్చించుకునే విధంగా కాంట్రవర్సీ చిత్రాల్లో నటిస్తోంది. ఇంతకు ఆ పాప ఎవరంటే.. ఆదా శర్మ. విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన హారర్ మూవీ 1920లో యాక్ట్ చేసింది. ఇది మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత కూడా ఫిర్ అనే హారర్ సినిమాలో అవకాశం వచ్చింది.

ఆ తర్వాత అమ్మడిని తెలుగులోకి తీసుకువచ్చాడు..ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. హార్ట్ ఎటాక్ మూవీలో నితిన్ ను అమితంగా ప్రేమించే ప్రియురాలిగా నటించింది. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో యాక్చువల్లీ.. మా నాన్న అంటూ గారాలు తీస్తూ.. తండ్రి అడుగు జాడల్లో నడిచే కూతురి పాత్రలో మెరిసింది. సుబ్రమణ్యం ఫర్ సేల్, గరం సోసో అనిపించగా..ఆమె కెరీర్ గాడిన పడేలా చేసిన చిత్రం క్షణం. కనిపించేది కొన్ని నిమిషాలే ఆయన.. స్టోరీ అంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. వరుసగా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తోంది. ద కాంట్రవర్షియల్ మూవీ ది కేరళ స్టోరీ చిత్రంతో తన వైపు చూపు తిప్పుకునేలా చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరో వివాదాస్పదమైన సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. అదే బస్తర్.. ద నక్సల్స్ స్టోరీ.

నక్సల్స్ ఎక్కువగా ఉండే బస్తర్ ప్రాంతంలో జరిగే కథతో రాబోతుంది. ఈ చిత్రం మార్చి 15న విడుదల కాబోతుంది. ఆ మధ్యకాలంలో భయాందోళన కలిగించిన బ్లూ వేల్ యాప్ ఆధారంగా ద గేమ్ ఆఫ్ గిర్జిత్ అనే చిత్రంలో నటిస్తోంది. వీటితో పాటు షార్ట్ ఫిల్స్మ్, స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్ చేసింది. తెలుగులో మీట్ క్యూట్ ఓ ఎపిసోడ్‌లో కనిపిస్తోంది ఈ బ్యూటీ. సన్ ప్లవర్ అనే వెబ్ సిరీస్ ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ భామ మల్టీ టాలెంట్. కథక్ క్లాసికల్ డ్యాన్సర్ మాత్రమే కాదూ.. యోగా, జిమ్నాస్టిక్స్ చేయడంలో దిట్ట. శారీలో కూడా యోగసనాలు వేసి అదరగొట్టింది ఆదాశర్మ. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి