iDreamPost

The Kashmir Files Report : ది కాశ్మీర్ ఫైల్స్ రిపోర్ట్

The Kashmir Files Report : ది కాశ్మీర్ ఫైల్స్ రిపోర్ట్

ఇప్పుడు దేశమంతా మూవీ లవర్స్ మాట్లాడుకుంటున్న సినిమా ది కాశ్మీర్ ఫైల్స్. విడుదలైనప్పుడు అతి తక్కువ థియేటర్లలో స్క్రీనింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఇప్పుడు పబ్లిక్ డిమాండ్ మేరకు ప్రతి చోట షోలు పెంచుకుంటూ పోతోంది. సోషల్ మీడియాలో సైతం దీని తాలూకు వీడియోలు, రివ్యూలు, హల్చల్ చేస్తున్నాయి. గుజరాత్, మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. వివాదాలు కూడా లేకపోలేదు. జమ్ములోని కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శనను ఆందోళనకారులు అడ్డుకున్నారు. వాస్తవాలను వక్రీకరించి చూపించారని ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఇందులో ఏముందో రిపోర్ట్ లో చూద్దాం.

ఇది 1990 ప్రాంతంలో జరిగే కథ. కాశ్మీర్ ఇండియాలో భాగం కాదనే వేర్పాటు వాదంతో తీవ్రవాద చర్యలకు తెగబడ్డ టెర్రరిస్టులు అప్పటికే అక్కడ దశాబ్దాలుగా నివాసం ఏర్పరుచుకున్న కాశ్మీర్ హిందూ పండిట్లను లక్ష్యంగా చేసుకుని వాళ్ళను చంపడం మొదలుపెడతారు.ఇందులో తల్లితండ్రులు అన్నయ్యను కోల్పోయిన కృష్ణ పండిట్(దర్శన్ కుమార్)పెద్దయ్యాక తాతయ్య(అనుపమ్ ఖేర్) అస్థికలను కలపడం కోసం అక్కడికి వెళ్తాడు. యూనివర్సిటీ ప్రొఫెసర్ రాధికా మీనన్(పల్లవి జోషి)చేసిన బ్రెయిన్ వాష్ కు లొంగిపోయి ముందు పండిట్లదే తప్పనుకుంటాడు. తర్వాత ఏం జరిగిందనేది చాలా డిటైల్డ్ గా తెరమీద చూడాల్సిందే.

దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి చాలా సున్నితమైన అంశాన్ని తీసుకుని హార్డ్ హిట్టింగ్ స్క్రీన్ ప్లేతో అత్యంత సహజంగా ది కాశ్మీర్ ఫైల్స్ ని తెరకెక్కించారు. అధికారంలో ఉన్న బిజెపి పార్టీ అండతో ఇది విడుదలయ్యింది కానీ లేకపోతే సెన్సార్ గడప కూడా దాటలేనంత అభ్యంతరకర కంటెంట్ అయితే ఉంది. ఆ సమయంలో ఊచకోత గురించి భిన్న వాదనలు ఉన్నప్పటికీ వివేక్ విజువలైజ్ చేసిన తీరు మాత్రం అత్యంత సహజంగా ఉంది. కాకపోతే టెర్రరిస్టులు హత్యలు చేసే క్రమాన్ని మాత్రం మరీ తీవ్రంగా చూపించడం బాగా కలిచి వేస్తుంది. అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషిల అద్భుతమైన పెర్ఫార్మన్స్ సినిమాను ఇంకో స్థాయికి తీసుకెళ్లింది. మిథున్ చక్రవర్తి, పునీత్ ఇస్సార్ లాంటి సీనియర్లు ఉన్నంతలో తమ పాత్రలు చక్కగా పండించారు. మూడు గంటలకు పది నిముషాలు తక్కువ నిడివి ఉన్న ఈ మూవీని డాక్యుమెంటరీ స్టైల్ లో తీయడం సామాన్య ప్రేక్షకులకు కొంత ఇబ్బంది అనిపించవచ్చు.

Also Read : Thaman S : సంగీత దర్శకుడి పని ఇది కాదుగా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి