iDreamPost

సలార్ వాయిదా.. ‘వాక్సిన్ వార్’కి ఆ ఛాన్స్ మిస్ చేసిందా?

  • Author ajaykrishna Updated - 09:36 AM, Mon - 25 September 23
  • Author ajaykrishna Updated - 09:36 AM, Mon - 25 September 23
సలార్ వాయిదా.. ‘వాక్సిన్ వార్’కి ఆ ఛాన్స్ మిస్ చేసిందా?

ఇండస్ట్రీలో రెగ్యులర్ సినిమాలు కాకుండా కాస్త వివాదాల జోలికి వెళ్ళైనా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ. అలాంటి వారిలో బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఆ సినిమా ప్రభావం జనాలపై ఏ స్థాయిలో చూపించిందో.. కలెక్షన్స్ బట్టి చెప్పవచ్చు. బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ.. పాన్ ఇండియా సినిమాలకు పోటీగా విడుదలై కశ్మీర్ ఫైల్స్ మూవీ రూ. 300 కోట్లకు పైగా వసూల్ చేసింది. కేవలం రూ. 15 – 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. అసలు ఊహించని లాభాలను తేవడమే కాకుండా దేశవ్యాప్తంగా పలు వివాదాలకు తెరలేపింది.

వివాదాల మధ్య కూడా సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టి.. రికార్డు క్రియేట్ చేసింది. అంతేగాక ఇటీవల నేషనల్ అవార్డు సైతం సొంతం చేసుకొని మరోసారి చర్చల్లో నిలిచింది. అయితే.. ఇప్పుడదే డైరెక్టర్ వివేక్ తన కొత్త సినిమా ‘ది వాక్సిన్ వార్’ రిలీజ్ కి రెడీ చేశాడు. సెప్టెంబర్ 28న వాక్సిన్ వార్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. కాగా.. ఆదిపురుష్ సినిమా విషయంలో ప్రభాస్ ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద కామెంట్స్ చేసిన వివేక్.. సలార్ కి పోటీగా వాక్సిన్ వార్ ని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. ఎందుకంటే.. గతంలో కశ్మీర్ ఫైల్స్ కూడా.. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ కి పోటీగా రిలీజ్ అయ్యింది. అదే విధంగా సలార్ ని టార్గెట్ చేశాడు.

అనుకున్నట్లుగా సలార్ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 28న వాక్సిన్ వార్ ని అనౌన్స్ చేసి షాకిచ్చాడు. కానీ.. అనూహ్యంగా సలార్ మూవీ సెప్టెంబర్ 28 నుండి వాయిదా పడింది. దీంతో వాక్సిన్ వార్ కి పెద్ద షాక్ తగిలింది. సలార్ సినిమా వాయిదా పడటానికి టెక్నికల్ వర్క్ కాలేదని టీమ్ చెప్పింది. కానీ.. సలార్ వాయిదా వాక్సిన్ వార్ పై పడిందని అంటున్నారు. ఎందుకంటే.. సలార్ వాయిదా పడ్డాక వాక్సిన్ వార్ బజ్ తగ్గిపోయింది. జనాలు కూడా ఈ సినిమా గురించి పట్టించుకోవడం మానేశారని సౌత్ సినీ వర్గాలు చెబుతున్నాయి. కనీసం సలార్ పోటీలో ఉంటే.. ఆ సినిమాకు పోటీగా వస్తుందనే బజ్ అయినా ఉపయోగపడేది. కానీ.. సలార్ ఆ ఛాన్స్ ఇవ్వలేదని బాలీవుడ్ వర్గాల టాక్. మరి వాక్సిన్ వార్ ఎంతవరకు నెట్టుకొస్తుందో చూడాలి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి