iDreamPost

స్టార్ హీరోలను క్రాస్ చేసిన కార్తికేయ 2

నిఖిల్ దీని మీద ముందు నుంచి ఎంతో నమ్మకంతో ఉన్నప్పటికీ అతని అంచనాలకు మించి ఇది పెర్ఫార్మ్ చేయడం ఊహించని పరిణామం.

నిఖిల్ దీని మీద ముందు నుంచి ఎంతో నమ్మకంతో ఉన్నప్పటికీ అతని అంచనాలకు మించి ఇది పెర్ఫార్మ్ చేయడం ఊహించని పరిణామం.

స్టార్ హీరోలను క్రాస్ చేసిన కార్తికేయ 2

అండర్ డాగ్ గా బాక్సాఫీస్ బరిలో దిగిన కార్తికేయ 2 సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. నిఖిల్ దీని మీద ముందు నుంచి ఎంతో నమ్మకంతో ఉన్నప్పటికీ అతని అంచనాలకు మించి ఇది పెర్ఫార్మ్ చేయడం ఊహించని పరిణామం. తాజాగా హిందీ డబ్బింగ్ మార్కెట్ టాప్ 10 చోటు దక్కించుకోవడం పట్ల ఈ కుర్ర హీరో ఆనందం మాములుగా లేదు. పెద్ద క్యాస్టింగ్ ఉంటే తప్ప సాధ్యం కానీ 30 కోట్ల మార్క్ ని కేవలం నాలుగో వారంలోనే అందుకోవడం చిన్న విషయం కాదు. అందులోనూ హిందీ ఆడియన్స్ లో నిఖిల్ కి గతంలో ఎలాంటి గుర్తింపు లేదు. ఆ మాటకొస్తే అయిదు నిముషాలు కనిపించే అనుపమ్ ఖేర్ తప్ప ఇతర తారాగణం అంతా వాళ్లకు కొత్తే.

ఇక రికార్డు డీటెయిల్స్ లోకి వెళ్తే కార్తికేయ 2 డబ్బింగ్ వసూళ్లలో చాలా అలవోకగా కబాలి(28 కోట్లు), రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్(26 కోట్లు), రోబో (24 కోట్లు), రాధే శ్యామ్(19 కోట్లు), మేజర్(13 కోట్లు), కాలా(10 కోట్లు)ను దాటేసింది. ఇప్పుడు దీని పొజిషన్ 9లో ఉంది. ఎనిమిదో ప్లేస్ లో కెజిఎఫ్ చాప్టర్ 2 కొంచెం దూరంలో 44 కోట్లతో తిష్టవేసుకుని ఉంది. ఒకవేళ ఈ శుక్రవారం బ్రహ్మాస్త్ర కనక లేకపోయి ఉంటే కార్తికేయ 2 దీన్ని ఈజీగా బద్దలుకొట్టేదే. కానీ ఇప్పుడా అవకాశాలు తగ్గిపోయాయి. దానికేమైనా డిజాస్టర్ టాక్ వస్తే అప్పుడు మళ్ళీ ఆశలు పెట్టుకోవచ్చు. అయితే బ్రహ్మాస్త్ర టీమ్ నమ్మకం, విస్తృతంగా చేస్తున్న ప్రమోషన్లు చూస్తుంటే పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి.

ఎలా అయినా ఇంకో రెండు వారాలు కార్తికేయ 2కి గ్యారెంటీ రన్ ఉంటుంది. కాకపోతే ఇతర సినిమాల ప్రభావం ఎక్కువగా లేకపోతేనే మరిన్ని బెటర్ ఫిగర్స్ నమోదవుతాయి. ఇప్పుడు దీని దెబ్బకే పాత కార్తికేయను కూడా ఓటిటిలో అక్కడి ప్రేక్షకులు చూసేస్తున్నారు. మూడో భాగం ఉంటుందని దర్శకుడు చందూ మొండేటి ఆల్రెడీ క్లూ ఇచ్చాడు కాబట్టి 2023లో స్క్రిప్ట్ కనక పూర్తయితే వీలైనంత త్వరగా షూటింగ్ మొదలుపెడతారు. ఈలోగా నిఖిల్ 18 పేజెస్, స్పైలు ఆ గ్యాప్ ని పూడ్చేస్తాయి. కేవలం అరవై స్క్రీన్లతో మొదలుపెట్టి ఏడు వేల స్క్రీన్ల దాకా వెళ్ళిపోయినా కార్తికేయ 2 రీచ్ చూస్తుంటే ఇక ఓటిటిలో ఎలాంటి రికార్డులు దక్కుతాయో చూడాలి. సీతారామం, బింబిసారలను తట్టుకుని మరీ ఈ ఫీట్ సాధించడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి