iDreamPost

షార్ట్ కట్ కోసం గ్రేట్ వాల్ ఆఫ్ చైనానే తవ్వేశారు!

షార్ట్ కట్ కోసం గ్రేట్ వాల్ ఆఫ్ చైనానే తవ్వేశారు!

“గ్రేట్ వాల్ ఆఫ్ చైనా” గురించి అందిరికీ తెలిసిందే. అయితే ఇదే వాల్ కు ఉన్న రంధ్రాన్ని కొందరు వ్యక్తులు పెట్టి తవ్వి పెద్దది చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందని గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వాల్ ను తవ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును.. మీరు చదివింది నిజమే. ఇద్దరు వ్యక్తులు షార్ట్ కట్ కోసం ఏకంగా ఆ భారీ వాల్ నే తవ్వేసి మార్గాన్ని సులువు చేసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటి “గ్రేట్ వాల్ ఆఫ్ చైనా”. చారిత్రక కట్టడం కావడంతో రోజూ ఎంతో మంది పర్యాటకులు ఈ వాల్ ను చూడటానికి దేశవిదేశాల నుంచి తరలి వెళ్తుంటారు. ఇదిలా ఉంటే.. అది చైనాలోని ఉత్తర షాక్సీ ప్రావిన్స్ యూయు సమీపంలోని యాంగ్ క్యాన్హె టౌన్ షిప్ ప్రాంతం. ఇక్కడే ఇద్దరు వ్యక్తులు ఒక నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్ట్ ను తీసుకున్నారు. అయితే ఈ నిర్మాణానికి రాకపోకలకు చేయడానికి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గోడ అడ్డంగా ఉంది. దీంతో వారికి ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఈ క్రమంలోనే వారికి ఓ ఆలోచన వచ్చింది. అదేంటంటే ఆ గొడవను తవ్వేసి షార్ట్ కట్ గా వెళ్లాలని అనుకున్నారు.

అనుకున్నదే ఆలస్యం.. ఆ ఇద్దరు ఆగంతకులు ఈ గొడకు ఏర్పడ్డ చిన్న రంధ్రాన్ని యంత్రాల సాయంతో తవ్వి వారి మార్గాన్ని సులువు చేసుకున్నారు. అప్పటి నుంచి వారి వాహనాలను అక్కడి నుంచే తీసుకెళ్లారు. అయితే ఇదే విషయం ఇటీవల పోలీసుల దృష్టికి వెళ్లింది. వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. వారు తవ్వని గోడను చూసి పోలీసులు షాక్ గురయ్యారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. షార్ట్ కట్ కోసం ఏకంగా “గ్రేట్ వాల్ ఆఫ్ చైనా” ను తవ్వేసిన ఈ ఘటనపై అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి