iDreamPost

Gold Reserves: ఇండియాతో పోటీగా బంగారం కొంటున్న చైనా.! డ్రాగన్ ప్లాన్ ఏంటి?

  • Published May 06, 2024 | 3:02 PMUpdated May 06, 2024 | 3:02 PM

బంగారం ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయో ఎవరు చెప్పలేరు.. దీనితో ఇండియా ముందుగానే బంగారం నిల్వలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఇప్పుడు ఇండియాకు పోటీగా చైనా వచ్చేస్తుంది. అసలు చైనా ప్లాన్ ఏమై ఉంటుంది.

బంగారం ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయో ఎవరు చెప్పలేరు.. దీనితో ఇండియా ముందుగానే బంగారం నిల్వలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఇప్పుడు ఇండియాకు పోటీగా చైనా వచ్చేస్తుంది. అసలు చైనా ప్లాన్ ఏమై ఉంటుంది.

  • Published May 06, 2024 | 3:02 PMUpdated May 06, 2024 | 3:02 PM
Gold Reserves: ఇండియాతో పోటీగా బంగారం కొంటున్న చైనా.! డ్రాగన్ ప్లాన్ ఏంటి?

ప్రస్తుతం ఇండియాలో బంగారం నిల్వల స్థాయి అధికంగా పెరిగిన సంగతి తెలిసందే. ఎంత ఏంటి అనేది ఆర్బీఐ వెల్లడించలేదు కానీ.. గతంతో పోలిస్తే బంగారం నిల్వల స్థాయి అధికంగా పెరిగినట్లు ఇటీవల ప్రకటించింది. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరలు కూడా పెరుగుతూ తగ్గుటను ఉన్నాయి. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరు చెప్పలేరు. దీనితో ఇండియా బంగారాన్ని నిల్వ చేస్తుంది. అయితే, ఇప్పుడు ఇండియాకు పోటీగా చైనా వచ్చేస్తుంది, పొరుగు దేశం అయిన చైనా కూడా బంగారం నిల్వలను అధికంగా చేస్తుందట. ఎంతలా అంటే ఇక ఈరోజే ఆఖరి రోజు ఎంత కొన్నా ఈరోజే కొనేయాలి అన్నట్లుగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంది చైనా.. అసలు చైనా ఎందుకు ఇంతలా బంగారాన్ని కొనుగోలు చేస్తుంది. చైనా ప్లాన్ ఏంటో చూసేద్దాం.

ప్రస్తుతం చైనా భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంది. గత మార్చి నుంచి 2024 నెలలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వరుసగా 17 నెలల పాటు.. బంగారం కొనుగోలు చేసింది. ఎంత అంటే ప్రపంచంలో ఏ దేశ సెంట్రల్ బ్యాంక్ కొనుగోలు చేయని విధంగా చైనా బ్యాంక్ కొనుగోలు చేయడం గమనార్హం. ఇప్పటివరకు అంటే గత 50 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఒక్క ఏడాదిలోనే అధిక మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసింది. తమ నిధులన విస్తరింపచేయడానికి, అమెరికా డాలర్ పై ఆధారపడి ఉండకుండా ఉండేందుకు.. చైనా ఈ రేంజ్ లో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టమౌతుంది. మార్చి వరకు చైనా సుమారు 775 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా రుణాన్ని కలిగి ఉంది. 2021 లో 2.1 ట్రిలియన్ డాలర్స్ ఉండగా.. ఇప్పుడు భారీగా తగ్గించింది.

అయితే, గత నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు.. సూచనలు ఇచినప్పటికీ బంగారం ధరలు పెరిగాయి. ఇక ఈ ఏడాది డాలర్ విలువ ఇతర కరెన్సీలతో పోల్చితే.. పెరుగుతున్నప్పటికీ బంగారం ధర కూడా పెరుగుతూ ఉండడం ఆశ్చర్యం. ప్రస్తుతం ఔన్సు బంగారం ధర 2,300 వరకు దిగి వచ్చింది. ఈ క్రమంలో చైనా నిస్సందేహంగా బంగారం ధరలను పెంచుతుందని .. గోల్డ్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది మొదట్లోనే చైనా బంగారం దిగుమతులు 6% పెరిగినట్లు చైనా గోల్డ్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి.

ఇక గతంలో చైనా బంగారాన్ని తమ దేశ కరెన్సీ యువాన్ తో కొనుగోలు చేసిందని..కానీ ఇప్పుడు విదేశీ కరెన్సీతో బంగారం కొంటుందని.. నిపుణులు చెబుతున్నారు. కేవలం అమెరికా డాలర్, ఇతర కరెన్సీలపై ఆధారపడడం తగ్గించేందుకు చైనా ఇలా చేస్తుందని చెబుతున్నారు. అయితే, గతంలో మాస్కో పై విధించిన ఆంక్షల కారణంగా.. రష్యా డాలర్స్ హోల్డింగ్స్ ను నిలిపివేసి చర్యను.. అమెరికా తీసుకున్న తర్వాత.. చైనా తో పాటు అనేక సెంట్రల్ బ్యాంకులు బంగారాన్న్ని కొనుగోలు చేయడం ప్రారంభించాయి. ఇక ఇప్పుడు చైనా తమ బంగారం నిల్వలను మరింత వేగ వంతం చేస్తుంది. ఓ విధంగా ఇప్పటికే చైనా గోల్డ్ మార్కెట్ లో పట్టు సాధించిందని చెప్పొచ్చు. అలాగే ప్రస్తుత ధరల పెరుగు ధరలో కూడా ఆ దేశ ప్రభావం బాగా కనిపిస్తోంది. దీనితో ఇక ఇప్పుడు ఈ రేంజ్ లో ఇండియాతో పోటీగా బంగారం కొనుగోలు చేస్తుంటే.. చైనా ప్లాన్ ఏమై ఉంటుందా అని అందరికి కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి