iDreamPost

The Gray Man ‘ది గ్రే మ్యాన్’ రిపోర్ట్

The Gray Man ‘ది గ్రే మ్యాన్’ రిపోర్ట్

అవెంజర్స్ ది ఎండ్ గేమ్ తో ప్రపంచాన్ని ఊపేసిన రుస్సో బ్రదర్స్ నెక్స్ట్ మూవీ అంచనాలు ఎలా ఉంటాయో వేరే చెప్పాలా. దానికి తోడు కోలీవుడ్ స్టార్ ధనుష్ ఒక కీలక పాత్ర చేయడంతో ఇక్కడి ప్రేక్షకులకూ దీని మీద విపరీతమైన ఆసక్తి నెలకొంది. నెట్ ఫ్లిక్స్ ఇప్పటిదాకా నిర్మించిన వాటిలో హయ్యెస్ట్ బడ్జెట్ పెట్టింది ఈ గ్రే మ్యాన్ కే. కొన్ని రోజుల క్రితం అమెరికా తదితర దేశాల్లో థియేట్రికల్ రిలీజ్ ఇచ్చిన ఈ మూవీని నిన్నటి నుంచి ఓటిటి స్ట్రీమింగ్ లో పెట్టేశారు. బాషాపరంగా ఇబ్బందులు లేకుండా ఇంగ్లీష్ తో పాటు తెలుగు హిందీ తదితర డబ్బింగ్ ఆడియోలను ఇచ్చారు. మరి ఇన్ని అంచనాలను నిలబెట్టుకుందా లేదా రిపోర్ట్ లో చూద్దాం

సిక్స్(ర్యాన్ గోస్టింగ్) సిఐఎ ఏజెంట్. సియర్రా ఫోర్ అనే సంఘవిద్రోహ శక్తిని చంపడానికి అతన్ని నియమించుకుంటారు. అతనికి ఒక పెన్ డ్రైవ్ దొరుకుతుంది. అందులో చాలా ముఖ్యమైన రహస్యాలు, మాఫియాకు సంబంధించిన వివరాలు ఉంటాయి. దీన్ని చేజిక్కించుకోవడం కోసం లాయిడ్ హాన్నెస్(క్రిస్ ఎవాన్స్) రంగంలోకి దిగుతాడు. సిక్స్ ని చంపేసి ఆ డ్రైవ్ ని తేవడమే అతని టార్గెట్. కిరాయి హంతకుల ముఠా వెనుకబడుతుంది. సిక్స్ వీళ్లందరిని తప్పించుకుని ఆ పెన్ డ్రైవ్ ని ఏం చేశాడు, ఈ మొత్తం క్రైమ్ కి అవిక్ సాన్(ధనుష్) కు ఉన్న సంబంధం ఏంటనేది సినిమాలోనే చూడాలి. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రుస్సో బ్రదర్స్ దీన్ని తీర్చిదిద్దారు

కథ పరంగా చూసుకుంటే రుస్సో బ్రదర్స్ నుంచి ఇలాంటి రొటీన్ స్టఫ్ ని అసలు ఎక్స్ పెక్ట్ చేయలేం. యాక్షన్ ఎపిసోడ్స్ మీద పెట్టిన ఫోకస్ మిగిలిన అంశాల మీద పెట్టకపోవడంతో గ్రే మ్యాన్ చాలా మటుకు బోరింగ్ గానే సాగుతుంది. గతంలో చూసిన చాలా సినిమా ఛాయలు కనిపించడం పెద్ద మైనస్. పోరాట దృశ్యాలు కొన్ని అద్భుతంగా వచ్చినప్పటికీ అవి సైతం ఎక్కువసేపు కాపాడలేకపోయాయి. ధనుష్ ది కాంట్రాక్ట్ కిల్లర్స్ లో ఒకరైన పాత్ర. మరీ ఎగ్జైటింగ్ గా లేదు కానీ ఉన్నంతలో డీసెంట్ స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. విపరీతమైన యాక్షన్ లవర్స్ కి కొంతమేరకు ఓకే అనిపించినా అంచనాలు పెట్టుకుని చూసేవాళ్ళను మాత్రం ది గ్రే మ్యాన్ నిరాశపరుస్తుంది. గత వారం థియేట్రికల్ ప్రీమియర్ల నుంచి ఆల్రెడీ నెగటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీని ఓటిటి ఆడియన్సే రక్షించాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి