iDreamPost

చికిత్స చేస్తూ మహిళ పెదవి కట్ చేసిన డాక్టర్.. ఏడాదిగా నరకం..

Dentist Negligence Woman in Trouble: వైద్యం కోసం డాక్టర్ల వద్దకు వెళ్లే వారు చేసే పొరపాటు రోగులకు శాపంగా మారుతుంది. ఓ డాక్టర్ నిర్లక్ష్యం యువతికి నరకంగా మారింది.

Dentist Negligence Woman in Trouble: వైద్యం కోసం డాక్టర్ల వద్దకు వెళ్లే వారు చేసే పొరపాటు రోగులకు శాపంగా మారుతుంది. ఓ డాక్టర్ నిర్లక్ష్యం యువతికి నరకంగా మారింది.

చికిత్స చేస్తూ మహిళ పెదవి కట్ చేసిన డాక్టర్.. ఏడాదిగా నరకం..

వైద్యో నారాయణ హరి.. వైద్యులు దేవుళ్లతో సమానం అని అంటారు. తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. కానీ ఇటీవల కొంతమంది వైద్యులు వైద్య వృత్తికి కలంకం తెస్తున్నారు. వైద్యం కోసం వెళ్లిన పేషెంట్స్ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇటీవల వైద్యులు ఆపరేషన్ చేసిన తర్వాత కాటన్, సీజర్ ఇతర వస్తువులు మర్చిపోయి కుట్లు వేసి ఇటికి పంపిస్తున్నారు. తర్వాత తమ తప్పు తెలుసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది వైద్యులు తెలిసీ తెలియని చికిత్స చేస్తూ మనుషు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. స్మైల్ డిజైనింగ్ సర్జరీ కోసం వెళ్లిన ఓ యువకుడు వైద్యుడు చేసిన పొరపాటు వల్ల ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మరువక ముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో దంత వైద్య చేయించుకోవడానికి వెళ్లిన వింజం లక్ష్మినారాయణ అనే యువకుడు స్మైల్ డిజైనింగ్ సర్జరీ చేయించుకున్న కొద్ది సేపటికే ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి చనిపోయాడు.. అనస్తిషియా అధిక మోతాదులో ఇవ్వడం వల్ల లక్ష్మీనారాయణ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన మరువక ముందే హైదరాబాద్ లో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ డెంటిస్ట్ రొటీన్ చెకప్ కోసం తన వద్దకు వచ్చిన మహిళ పెదవులు కోయడమేకాదు.. ఇప్పుడు చాలా బాగుందని వెటకారం చేయడం గమనార్హం. ఈ ఘటన జూబ్లీహిల్స్ ఎఫ్ఎంఎస్ హాస్పిటల్ లో జరిగింది.

జూబ్లీహిల్స్ లో ఎఫ్ఎంఎస్ హాస్పిటల్ లో అనస్థీషియా ఓవర్ డోస్ కారణంగా ఒక వ్యక్తి మరణించిన ఘటనతో ఇప్పుడు మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా బాధితురాలి స్నేహితురాలు సౌమ్య మాట్లాడుతూ.. ‘తన స్నేహితురాలు పెదవిలోని కుడి భాగం కట్ అయ్యింది. ఇప్పటికి సంవత్సరం గడిచింది.. నరకం అనుభవిస్తుంది. పెదవులు పూర్తిగా చాచలేకపోతుంది.. బహిరంగంగా నవ్వలేకపోతుంది, పెదవులు ఫ్లెక్సిబిలిటీ కోసం స్టెరాయిడ్స్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది. గతంలో నా స్నేహితురాలి తల్లి తన కూతురు పరిస్థితి గురించి వైద్యులను సంప్రదిస్తే.. కొన్ని నెలల్లో తగ్గిపోతుందని చెప్పినప్పటికీ సంవత్సరం గడిచినా అదే పరిస్థితి ఉండటంతో ఆస్పత్రి ఇన్ చార్జితో మాట్లాడినపుడు తమ బాధను ఎగతాళి చేస్తూ మాట్లాడారు.. తమ సమస్యలు విని గట్టిగా నవ్వారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి