iDreamPost

గూస్ బంప్స్ ఇచ్చే టెర్రిఫిక్ ఎపిసోడ్

గూస్ బంప్స్ ఇచ్చే టెర్రిఫిక్ ఎపిసోడ్

ఆర్ఆర్ఆర్ తాలూకు అప్ డేట్స్ ఎన్ని వచ్చినా అసలైన విడుదల తేదీ గురించి మాత్రం పక్కా సమాచారం రావడం లేదు. ఇందులో రాజమౌళి తప్పేమి లేదు కానీ ప్రొడక్షన్ లో జరుగుతున్న ఆలస్యం మొదలు హీరోలకు దెబ్బలు తగలడం, రెండు కరోనా వేవ్ లు లాంటి ఎన్నో కారణాలు దీనికి దోహదపడ్డాయి.ఇప్పుడు అక్టోబర్ లో రావడం అసాధ్యమే కాబట్టి 2022 వేసవి తప్ప వేరే మార్గం దాదాపు లేనట్టే. అయితే మరో పాన్ ఇండియా మూవీ కెజిఎఫ్ 2 ఏప్రిల్ ని లాక్ చేసుకోవడంతో జక్కన్న టీమ్ ఆలోచనలో పడింది. జనవరి చివరి వారంలో రావడమా లేక జూన్ లేదా జూలైకు వెళ్లడమా అనే ఆలోచనలు తీవ్రంగా జరుగుతున్నాయి.

ఇక దీనికి సంబంధించిన కొత్త విశేషాలు బాగా ఎగ్జైట్ చేసేలా ఉన్నాయి. అందులో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ మీద చిత్రీకరించిన భారీ యాక్షన్ ఎపిసోడ్ ఒకటట. మగధీర తరహాలో వంద మందికి పైగా బ్రిటిష్ సైనికులతో తారక్ చేసే భీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ ఇచ్చే రేంజ్ లో ఉంటుందట. ఇది జరిగాకే రామ్ చరణ్ తారక్ మధ్య ఫస్ట్ క్లాష్ ఉంటుందని, ఇద్దరూ ఒక్కటయ్యి యుద్ధం చేసే కీలక ఘట్టానికి ఇది లీడ్ గా సాగుతుందని చెబుతున్నారు. ఎమోషన్లు కూడా ఏ మాత్రం తగ్గకుండా జక్కన్న బ్రాండ్ తో కట్టిపడేసేలా ఉంటాయని యూనిట్ సభ్యల మాట. జూనియర్ కెరీర్ లోనే ఇది బెస్ట్ ఫైట్ అంటున్నారు.

ఇవన్నీ ఎలా ఉన్నా ఊరించి ఊరించి ఉసురుమనడం తప్ప రిలీజ్ కోసం ఎదురు చూసే కొద్దీ అంతకంతా ఆలస్యం అవుతూనే ఉంది. నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ క్రేజీ మల్టీ స్టారర్ ని సోలో రిలీజ్ చేయడం కోసమే ఎదురు చూస్తున్నారు నిర్మాతలు. త్వరలో ప్రెస్ మీట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు హీరోలతో కలిసి రాజమౌళి మళ్ళీ మీడియాతో మాటాడతారని టాక్ ఉంది కానీ అది ఎప్పుడు అనేది తెలియదు. కీరవాణి సంగీత సంగీత దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ కు సాయి మాధవ్ బుర్ర సంగీతం అందించారు. అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, సముతిరఖని ఇతర కీలక తారాగణం

Also Read :  రాజకీయ నేపథ్యంలో మెగా పవర్ స్టార్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి