iDreamPost
android-app
ios-app

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. చివరకు విషాదంగా..

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. చివరకు విషాదంగా..

సోషల్‌ మీడియాలో మొదలయ్యే ప్రేమ కథల్లో నూటికి 80 శాతం విషాదంగానే ముగుస్తున్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియా ద్వారా మొదలయ్యే పెళ్లి తర్వాత ప్రేమ కథలు రెండు కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. తాజాగా, తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మొదలైన ప్రేమ కథ విషాదంగా ముగిసింది. ప్రియుడు తన ప్రియురాలిని హత్య చేసి చంపి.. తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

తమిళనాడులోని శివగంగ జిల్లాకు చెందిన వినోధిని అనే 19 ఏళ్ల యువతికి కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. ఈమెకు కొన్ని నెలల క్రితం తెన్‌కాశి జిల్లా, వాలసాయ్‌ గ్రామానికి చెందిన మనో రంజిత్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇ‍ద్దరూ తరచుగా ఫోన్‌ ద్వారా కాల్స్‌, మెసేజ్‌లు చేసుకునేవారు. వినోధిని పెళ్లయిందని తెలిసినా అతడు ఆమెను ప్రేమించాడు. ఇదే తర్వాత అతడికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇద్దరి మధ్యా ప్రేమ ముదరటంతో కలిసి ఉండాలని నిశ్చయించుకున్నారు.

ఈ నేపథ్యంలోనే వినోధిని భర్తను విడిచి అతడితో పాటు వెళ్లిపోయింది. వీరిద్దరూ కలిసి రంజిత్‌ ఊర్లోనే కలిసి ఉండేవారు. అయితే, ఈ విషయం తెలిసిన వినోధిని ఇన్‌స్టాగ్రామ్‌లోని మగ ఫ్రెండ్స్‌.. ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో రంజిత్‌కు కోపం వచ్చింది. ఇక, అప్పటినుంచి ఇద్దరి మధ్యా గొడవలు జరగటం మొదలయ్యాయి. గొడవలతో పాటు వినోధినికి మగ స్నేహితులతో ఉన్న చనువు కారణంగా రంజిత్‌కు ఓ దారుణమైన ఆలోచన వచ్చింది. వినోధినిని చంపాలని నిశ్చయించుకున్నాడు.

తాజాగా, ఆమెను దగ్గరలోని అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో గొడవపెట్టుకున్నాడు. గొడవలో భాగంగా రంజిత్‌ను కొట్టి చంపాడు. వినోధిని శవాన్ని స్నేహితుల సహాయంతో మాయం చేశాడు. తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు అతడ్ని ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, రంజిత్‌ వినోధినిని హత్య చేసిన విషయం గ్రామస్తుల ద్వారా పోలీసులకు తెలిసింది. పోలీసుల రంగంలోకి దిగి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసును అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు.  మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet