iDreamPost
android-app
ios-app

వీడియో: బెడ్ రూంలోకి 10 అడుగుల ఫైథాన్.. చాకచక్యంగా ఫైట్ చేసి..!

  • Published Sep 26, 2023 | 6:09 PM Updated Updated Sep 26, 2023 | 6:09 PM
  • Published Sep 26, 2023 | 6:09 PMUpdated Sep 26, 2023 | 6:09 PM
వీడియో: బెడ్ రూంలోకి 10 అడుగుల ఫైథాన్.. చాకచక్యంగా ఫైట్ చేసి..!

చెట్లు, చెదలు దగ్గరగా ఉన్న కొన్ని ఇళ్లల్లోకి అప్పుడప్పుడు కొన్ని రకాల పాములు ప్రవేశిస్తుంటాయి. వెంటనే అప్రమత్తమై స్థానికుల సాయంతో వాటిని పట్టుకుని అడవిల్లో వదిలేస్తుంటారు. కానీ, బెడ్ రూంలోకి ఫైథాన్ రావడం ఎప్పుడైనా చూశారా? కానీ ముంబైలోని ఓ ప్రాంతంలో అదే జరిగింది. 10 అడుగుల ఫైథాన్ కిటికీ నుంచి ఏకంగా బెడ్ రూంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసింది. ఆ ఇంట్లోని వ్యక్తులు వెంటనే అప్రమత్తమై కొందరి యువకుల సాయంతో ఆ ఫైథాన్ ను అక్కడి నుంచి తరిమికొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ముంబై థానే జిల్లాలోని ఓ ప్రాంతంలోని ఇటీవల ఓ ఇంటి సమీపంలోకి 10 అడుగుల పైథాన్ ప్రవేశించింది. మెల్లగా పాకుతూ కిటికీ నుంచి ఏకంగా బెడ్ రూంలోకి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. వెంటనే అప్రమత్తమైన ఇంట్లోని వ్యక్తులు స్థానికులకు సమాచారం అందించారు. దీన్ని చూసి గ్రామ ప్రజలు అంతా ఒక్కసారిగా భయందోళనలకు గురయ్యారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఇద్దరు యువకులు ఆ ఫైథాన్ తో ఫైటింగ్ చేశారు. ఇక చాకచక్యంగా దాంతో పోరాడి మొత్తానికి కిటికీలో ఉన్న దాన్ని కిందకు తోసేశారు. దీంతో ఆ పైథాన్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆ ఇంట్లోని వ్యక్తులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabet