iDreamPost
android-app
ios-app

వీడియో: అర్ధరాత్రి కారులో వచ్చి దొంగతనం చేసిన అమ్మాయిలు..!

  • Published Nov 15, 2023 | 12:40 PM Updated Updated Nov 15, 2023 | 12:40 PM

ఈ మద్య కాలంలో కొంతమంది చిత్ర విచిత్రమైన దొంగతనాలు చేయడం సోషల్ మీడియాలో ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం.

ఈ మద్య కాలంలో కొంతమంది చిత్ర విచిత్రమైన దొంగతనాలు చేయడం సోషల్ మీడియాలో ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం.

  • Published Nov 15, 2023 | 12:40 PMUpdated Nov 15, 2023 | 12:40 PM
వీడియో: అర్ధరాత్రి కారులో వచ్చి దొంగతనం చేసిన అమ్మాయిలు..!

దొంగతనాలు పలు రకాలు.. ఈజీ మనీ కోసం కొంతమంది దొంగతనాలు చేస్తే.. కేవలం జల్సాలు, ఎంజాయ్ మెంట్ కోసం మరికొంతమంది దొంగతనాలకు పాల్పపడుతున్నారు.  ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చెడ్డీ గ్యాంగ్ ఏ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నారు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే కొంతమంది చాలా చిత్రమైన దొంగతనాలు చేస్తూ సీసీ కెమెరాకు అడ్డంగా బుక్కవుతున్నారు.  ఖరీదైన కార్లలో వచ్చి దొంగతనాలకు పాల్పడటం చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ముగ్గురు అమ్మాయిలు విచిత్రమైన దొంగతనానికి పాల్పపడ్డారు.. దానికి సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో ఓ ఇంటి బయట ఉంచిన పూల కుండీలు కారులో ఇచ్చిన ఓ యువతి దొంగిలించింది. ఆ తర్వాత కారులో మరో ఇద్దరు యువతులు వచ్చి ఇంటి ముందు గోడపై ఉంచిన పూల కుండీలు దొంగిలించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. విచిత్రం ఏంటంటే ఆ యువతులు కారులో వచ్చి మరీ చోరీకి పాల్పపడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యంలో మొదట ఇద్దరు మహిళలు కారులో వచ్చారు. ఒక మహిళ మెయిన్ గేటు వద్ద ఏర్పాటు చేసి పూల కుండీ చోరీ చేసి కారులో వెళ్లిపోయింది. తర్వాత మరో ఇద్దరు యువతులు ఇంటి ముందు కారు ఆపి గోడకు ఇరువైపులా ఉన్న పూల కుండీలను దొంగిలించి కారులో వేగంగా వెళ్లిపోయారు. ఈ ప్రాంతంలో గత వారం రోజుల నుంచి దాదాపు 10 దొంగతన సంఘటనలు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు ఢిల్లీ-గురు‌గ్రామ్ ఎక్స్ ప్రెస్ లోని అంబియన్స్ మాల్ వద్ద ఉన్న ఖరీదైన పూల కుండీలు వరుసగా దొంగిలించబడ్డాయి అని అంటున్నారు. ఎస్‌యూవీ లో పూల కుండీలను ఉంచుతున్న ఇద్దరు వ్యక్తుల వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఈ కేసులో గురు గ్రామ్ కి చెందిన 50 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల భారత్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి జీ 20 శిఖరాగ్ర సమావేశం తరువాత ఢిల్లీ రోడ్లు పూల కుండీలతో అలంకరించారు. ఈ నేపథ్యంలోనే అనేక పూల కుండీలు దొంగతనానికి గురైనట్లు నివేదికలు తెలిపాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. కారులో వచ్చి అమ్మాయిలు అలా పూల కుండీలు దొంగిలించడం ఏంట్రా బాబూ అని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటు.. బహుషా అవి ఎంతో ఖరీదైన ఫ్లవర్ పాట్స్ అయి ఉంటాయని మరికొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişjojobet girişcasibomcasibomgrandpashabet