iDreamPost
android-app
ios-app

వీడియో: సింహంలా గర్జిస్తున్న చిన్నారి.. ఇది మిమిక్రీ కాదు..

  • Published Apr 27, 2024 | 6:51 PM Updated Updated Apr 27, 2024 | 6:51 PM

Riley Roaring As Lion: ఈ చిన్నారి టాలెంట్ చూస్తే మీరు ఇట్టే ఫిదా అయిపోతారు. మీరు కళ్లు మూసుకుని ఆ చిన్నారు గర్జన వింటే.. నిజంగానే సింహం వచ్చేసింది అనుకుంటారు.

Riley Roaring As Lion: ఈ చిన్నారి టాలెంట్ చూస్తే మీరు ఇట్టే ఫిదా అయిపోతారు. మీరు కళ్లు మూసుకుని ఆ చిన్నారు గర్జన వింటే.. నిజంగానే సింహం వచ్చేసింది అనుకుంటారు.

  • Published Apr 27, 2024 | 6:51 PMUpdated Apr 27, 2024 | 6:51 PM
వీడియో: సింహంలా గర్జిస్తున్న చిన్నారి.. ఇది మిమిక్రీ కాదు..

మీరు నిద్ర లేచిన దగ్గరి నుంచి దాదాపుగా స్మార్ట్ ఫోన్ పట్టుకునే ఉంటారు. ఆ క్రమంలో అప్పుడప్పుడు అయినా సోషల్ మీడియా ఓపెన్ చేసి చూస్తుంటారు. దానిలో మీకు వైరల్ రీల్స్ కనిపిస్తూ ఉంటాయి. కొందరు వారిలో దాగున్న నైపుణ్యాలను చూపిస్తూ రీల్స్ చేస్తుంటారు. కొందరు డాన్స్ చేస్తే.. ఇంకొందరు పాటలు పాడతారు.. మరికొందరు వంటలు చేస్తారు. ఇలా ఎవరి టాలెంట్ ని వాళ్లు బయటపెడుతూ ఉంటారి. అలాగే ఒక ఐదేళ్ల చిన్నారి తనలో ఒక స్పెషల్ టాలెంట్ ని బయట పెట్టింది. ఆమె టాలెంట్ చూని సోషల్ మీడియా కూడా షాకైపోయింది. ఆమె టాలెంట్ ఏంటంటే.. సింహంలా అరవడం. వింటే మీ చెవులను మీరు కూడా నమ్మలేరు.

చిన్న పిల్లలు చాలా చురుకుగా ఉంటారు. ఏది చూసినా ఇట్టే పట్టేస్తారు. పెద్ద వారితో పోలిస్తే చాలా వేగంగా నేర్చుకుంటారు. నిజానికి పెద్దవారితో పోలిస్తే చాలా బాగా నేర్చుకుంటారు. ముఖ్యంగా జంతువుల శబ్ధాలను అనుకరిస్తూ ఉంటారు. అలాగే ఈ చిన్నారి సింహం వాయిస్ ని ఇమిటేట్ చేసింది. అది కూడా ఎంత పక్కాగా అంటే.. ఇంకో సింహానికి వినిపిస్తే అది కూడా సింహం అనే నమ్మేస్తుంది. మీరు గనుక కళ్లు మూసుకుని ఈ చిన్నారి గర్జన వింటే నిజంగా సింహం వచ్చింది అనుకుంటారు. ఆమె అంత క్యూట్ గా సింహంలా గర్జించిన వీడియో నెట్టింట పిచ్చ వైరల్ అయ్యింది. ఆ తర్వాత అంతా అసలు ఆ చిన్నారు ఎవరు అంటూ వెతుకుతున్నారు.

ఈ వైరల్ వీడియోలో ఉన్న చిన్నారి పేరు రిలీ కే స్కాట్. రిలీ తల్లి ఆ చిన్నారి చేసే అల్లరిని వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలా ఒకసారి రిలీ సింహంలా అరుస్తూ వీడియోలో కనిపించింది. ఆ తర్వాత నెటిజన్స్ అంతా రిలీ సింహం శబ్ధాలకు మెస్మరైజ్ అయిపోయారు. అందరూ ఆమెను ప్రశంసించడం ప్రారంభించారు. ఆ విషయాన్ని రిలీకి చెప్తూ తల్లి మరో వీడియో తీసింది. నువ్వు సింహంలా అరుస్తున్న వీడియో అందరికీ బాగా నచ్చిందంట. నువ్వు అలా అరుస్తుంటే రియల్ గా ఉంది అంటున్నారు అని చెప్తుంది. అందుకు ఆ చిన్నారి అది నిజమే అంటూ సమాధానం చెప్తుంది.

సింహంలా ఎలా అరవాలో కూడా రిలీ నేర్పించింది. గాలిని లోపలికి పీర్చుకుని శబ్ధం చేస్తూ గాలిని బయటకు వదలాలి అంట. ఏప్రిల్ 8న పోస్ట్ చేసిన ఈ వీడియోకి ట్విట్టర్ లో 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే నెటిజన్స్ రిలీ టాలెంట్ కి ఫిదా అయిపోయారు. ఆమె ఒక నిజమైన సింహంలా గర్జిస్తోంది అంటున్నారు. ఇంకొందరు అయితే ఆమె గత జన్మలా ఆడ సింహం అయ్యుంటుంది అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ వైరల్ వీడియో మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş