iDreamPost
android-app
ios-app

లవర్ చేతిలో దగా పడ్డా.. కుమార్తె కోసం పోరాడి నిలబడ్డ తండ్రి కథ!

  • Published May 30, 2024 | 10:20 PM Updated Updated May 31, 2024 | 2:40 PM

Viral Story Of A Betrayed Young Man By His Lover: మీరు ఇప్పటివరకు చాలానే లవ్ స్టోరీలు విని ఉంటారు, చూసి ఉంటారు. కానీ, ఇలాంటి ఒక ప్రేమకథను మాత్రం విని ఉండరు. ఈ కుర్రాడు ప్రియుడిగా ఓడిపోయినా.. తండ్రిగా మాత్రం అద్భుత విజయం సాధించాడు.

Viral Story Of A Betrayed Young Man By His Lover: మీరు ఇప్పటివరకు చాలానే లవ్ స్టోరీలు విని ఉంటారు, చూసి ఉంటారు. కానీ, ఇలాంటి ఒక ప్రేమకథను మాత్రం విని ఉండరు. ఈ కుర్రాడు ప్రియుడిగా ఓడిపోయినా.. తండ్రిగా మాత్రం అద్భుత విజయం సాధించాడు.

  • Published May 30, 2024 | 10:20 PMUpdated May 31, 2024 | 2:40 PM
లవర్ చేతిలో దగా పడ్డా.. కుమార్తె కోసం పోరాడి నిలబడ్డ తండ్రి కథ!

ఇప్పటివరకు ఎన్నో గొప్ప గొప్ప ప్రేమకథలను విని ఉంటారు. ఎంతో మంది గొప్ప ప్రేమికులను చూసి ఉంటారు. చరిత్రలో కూడా ప్రేమ, ప్రేమికుల గురించి చాలానే కథలు ఉన్నాయి. వాటిలో చాలావరకు స్ఫూర్తి పొందాల్సిన కథలే ఉంటాయి. అయితే గుణపాఠం నేర్చుకోవాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి ఒక కథే ఇది కూడా. ఇప్పుడు చెప్పుకునే కుర్రాడు ఒక ప్రియుడిగా అతి దారుణంగా ఓడిపోయాడు. కానీ, ఒక తండ్రిగా మాత్రం అద్భుత విజయాన్ని సాధించాడు. అంతేకాకుండా ప్రేమ పేరుతో అవసరాలు, కోరికలు తీర్చుకుంటా పవిత్ర బంధాన్ని అపహాస్యం చేస్తున్న ఎంతోమందికి ఈ కుర్రాడి కథ ఒక పెద్ద ఉదాహరణ అనే చెప్పాలి.

ఈ కుర్రాడిపై సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున ప్రశంసలు కురుస్తున్నాయి. ఇతను తాను ప్రేమించిన అమ్మాయితో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాడు. వాళ్ల రిలేషన్ మొదలైన 4 నెలల తర్వాత తన ప్రియురాలు గర్భవతి అని గ్రహించాడు. ఆ తర్వాత వాళ్లు ఆ బిడ్డను కనాలి అని ఫిక్స్ అయ్యారు. అయితే కొన్ని నెలల తర్వాత ఆమెకు మరికొంతమందితో రిలేషన్ ఉన్నట్లు గ్రహించాడు. ఆ అమ్మాయి మరికొంత మందితో శారీ*రకంగా కలుస్తున్నట్లు తెలుసుకున్నాడు.

7 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఆ యువతి తన మరో బాయ్ ఫ్రెండ్ తో శృంగా*రంలో పాల్గొన్నట్లు తెలుసుకున్నాడు. అయినా కూడా అవన్నీ తనకు పుట్టబోయే బిడ్డ కోసం భరించాడు. ఎలాగైనా ఆ యువతితో రిలేషన్ కంటిన్యూ చేయాల్సిందే అని ఫిక్స్ అయిపోయాడు. అనుకున్నట్లుగా ఆ యువతికి అమ్మాయి పుట్టింది. ఆ చిన్నారికి ఎల్వ్ అనే పేరు పెట్టారు. అయితే బిడ్డ పుట్టిన కొద్దిరోజులకు ఆ యువతి ఈ కుర్రాడిని కాకుండా తన కొత్త బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యింది. అయితే ఈ కుర్రాడికి డబ్బులు ఇచ్చేసి ఆ చిన్నారిని అనాథాశ్రమంలో వదిలేయాలని ఒత్తిడి చేశారు. కానీ, ఆ కుర్రాడు మాత్రం తన కుమార్తెను వదులుకునేందుకు సిద్ధంగా లేడు.

ఏడాదిపాటు ఆ యువతితో పోరాడిన తర్వాత తన కుమార్తె మీద కస్టడీ అధికారాన్ని పొందాడు. ఆ తర్వాత తన ఉద్యోగాన్ని వదిలేసి మరీ.. పిల్లను చూసుకోవడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆ చిన్నారిని కన్నతల్లిలాగానే సాకాడు. ఈ యువకుడి ప్రేమకథ, కన్న కుమార్తె కోసం తాను చేసిన త్యాగం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే ఈ కుర్రాడు ఎంతో వైరల్ కూడా అవుతున్నాడు. ఒక ప్రియుడిగా ఆ కుర్రాడు ఘోరంగా ఓడిపోయాడు అంటున్నారు. అలాంటి అమ్మాయిని ఎంచుకు పెద్ద తప్పు చేశాడు అంటున్నారు. అయితే తండ్రిగా మాత్రం అతను సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కుర్రాడికి కచ్చితంగా హ్యాట్సాఫ్ చెప్పాలి అంటున్నారు. అందరూ ఈ తండ్రికి హ్యాట్సాఫ్ చెప్తున్నారు. మరి.. ఈ తండ్రిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet