Swetha
ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణించాలంటే ఇప్పుడు అందరు ఎక్కువగా ఊబర్, ఓలా యాప్స్ ను ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే, ఇలా ఊబర్ బుక్ చేసుకున్న ఒక వ్యక్తికి .. ఒక షాకింగ్ ఘటన ఎదురయ్యింది.
ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణించాలంటే ఇప్పుడు అందరు ఎక్కువగా ఊబర్, ఓలా యాప్స్ ను ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే, ఇలా ఊబర్ బుక్ చేసుకున్న ఒక వ్యక్తికి .. ఒక షాకింగ్ ఘటన ఎదురయ్యింది.
Swetha
మారిన టెక్నాలజీలో గత కొంతకాలంగా.. ఫుడ్ డెలివరీ యాప్స్ తో పాటు, ఓలా, ఊబర్ ఇలాంటి యాప్స్ వాడకం కూడా బాగా పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్స్ లో ఇప్పుడు ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాము. అలానే ఊబర్, ఓలా పేరులు చెప్పి.. అమ్మాయిలని మోసం చేసిన సంఘటనలు కూడా.. ఇప్పటివరకు ఎన్నో చూశాము. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే సంఘటన వింటే మాత్రం.. ఔరా అంటూ నోటి మీద వేలు వేసుకోవాల్సిందే. సాధారణంగా ఊబర్ కానీ, ఓలా కానీ బుక్ చేసుకున్న ఎవరికైనా సరే.. వారు వెళ్లే దూరాన్ని బట్టి వారు చెల్లించాల్సిన అమౌంట్ ను ఛార్జ్ చేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం ఎక్కువసేపు వెయిట్ చేసినపుడు వెయింటింగ్ ఛార్జెస్ వేస్తూ ఉంటారు. కానీ, కర్ణాటక లో మాత్రం ఊబర్ బుక్ చేసుకున్న ఓ వ్యక్తికీ.. ఓ వింత అనుభవం ఎదురయ్యింది. అదేంటో తెలుసుకుందాం.
సహజంగా ఏ ట్రాన్స్పోర్ట్ యాప్ అయినా కానీ.. వారు ప్రయాణించే దూరాన్ని బట్టీ, ఆయా సమయాన్ని బట్టి.. కస్టమర్స్ కు ఛార్జ్ చేస్తుంటారు. వాటిలో మహా అయితే, ఇప్పటివరకు హైయెస్ట్ ప్రైస్.. వెయ్యి రూపాయలు లేదా దానికంటే తక్కువే చూసి ఉంటాం. అయితే, కర్ణాటకలో ఈ విషయంలో ఓ వ్యక్తికీ ఎదురైన సంఘటన గురించి తెలుసుకుంటే మాత్రం అందరు ఆశ్చర్యపోక తప్పదు. సదరు వ్యక్తి.. తన అవసరాల నిమిత్తం బెంగళూరు కు వెళ్ళాడు. మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి అతనికి బస్సు రూట్ కన్ఫ్యూజన్ గా అనిపించి.. ఊబర్ బుక్ చేసుకోవాలన్నడట. తానూ టిన్ ఫ్యాక్టరీ నుంచి కోరమంగళ వెళ్లేందుకు.. ఊబర్ ను బుక్ చేసుకున్నాడు. తానూ బుక్ చేసుకునేటప్పుడు ఆ యాప్ లో చూపించిన ఛార్జ్ రూ. 207. కానీ, తానూ డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత మాత్రం అతనికి చూపించిన అమౌంట్.. ఏకంగా రూ.1,03,11,055 ఛార్జ్. ఈ అమౌంట్ ను చూసి ఒక్కసారిగా ఆ డ్రైవర్, కస్టమర్ ఇద్దరూ ఆశ్చర్యానికి గురయ్యారట.
కాగా, దీనికి సంబంధించిన వీడియోను కూడా.. స్వయంగా ఆ వ్యక్తే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసాడు. డెస్టినేషన్ రీచ్ అయ్యాక తన మొబైల్ లో చూపించిన బిల్ ను చూసి షాక్ అయ్యానని.. దానిపై యాప్ సర్వీస్ వారి నుంచి కూడా ఎటువంటి స్పందన లేదని.. ప్రస్తుతానికి తానూ మాత్రం రూ. 207 మాత్రమే చెల్లించానని.. తర్వాత వారు దానిపై ఏం యాక్షన్ తీసుకుంటారో తెలియదంటూ వాపోయాడు. ఇక సోషల్ మీడియాలో దీనిని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ప్రూఫ్స్ పెట్టుకుని కంప్లైంట్ రైజ్ చేస్తే తప్ప ప్రాబ్లమ్ సాల్వ్ కాదని ఒకరు.. ఊబర్ కు సంబంధించిన ఆటోలన్నీ మీకు అమ్మేస్తున్నారు అందుకే ఇంత బిల్ అంటూ ఫన్నీ గా మరొకరు.. ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ కాబట్టి.. కొన్ని సార్లు ఇటువంటి అవకతవకలు వస్తూ వస్తుంటాయి. ఇక్కడ కూడా ఇటువంటి టెక్నీకల్ ప్రాబ్లమ్ ఏ వచ్చి ఉండవచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.