iDreamPost
android-app
ios-app

Car Driving In River:నదిలో థార్‌ తో డ్రైవింగ్‌.. ఇలా ఎందుకు చేశారంటే?

  • Published Dec 26, 2023 | 12:43 PM Updated Updated Dec 26, 2023 | 12:43 PM

పెద్ద పెద్ద నగరాలలో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుందన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ ట్రాఫిక్ నుంచి తప్పించేందుకు కొందరు ఏకంగా నదీ మార్గాన్నే ఎంచుకుని.. ప్రయాణించిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తుంది.

పెద్ద పెద్ద నగరాలలో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుందన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ ట్రాఫిక్ నుంచి తప్పించేందుకు కొందరు ఏకంగా నదీ మార్గాన్నే ఎంచుకుని.. ప్రయాణించిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తుంది.

  • Published Dec 26, 2023 | 12:43 PMUpdated Dec 26, 2023 | 12:43 PM
Car Driving In River:నదిలో థార్‌ తో డ్రైవింగ్‌.. ఇలా ఎందుకు చేశారంటే?

ఈ మధ్య మహా నగరాల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. దీనితో ప్రజలు గంటలు గంటలు ట్రాఫిక్ లోనే సమయాన్ని గడపాల్సి వస్తుంది. అందులోను సెలవు రోజుల్లో అయితే, అందరూ ట్రిప్స్, టూర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఇంకాస్త ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవ్వడం సహజం. అయితే, ట్రాఫిక్ నుంచి తప్పించుకుని సులువుగా వెళ్లడం కోసం ప్రయాణికులు అనేక మార్గాలను ఎంచుకుంటారు. ఈ క్రమంలోనే హిమాచల్ ప్రాంతమంతా.. వరుస హాలిడేస్ రావడంతో, టూరిస్ట్ లతో రద్దీగా మారింది. ఈ మేరకు కొంతమంది టూరిస్టులు ట్రాఫిక్ నుంచి సులువుగా బయటపడేందుకు.. ఏకంగా నదిలోనే తమ కార్ ను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

అది హిమాచల్ ప్రదేశ్ లోని లహల్ వ్యాలీలో గల చంద్రా నది. అయితే, సోమవారం సాయంత్రం కొంతమంది ప్రయాణికులు.. తమ థార్ SUV లో ఈ నదిలో ప్రయాణించారు. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు వారిపై విమర్శలు కురిపిస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. అదృష్టవశాత్తు ఆ సమయంలో నదిలో నీటిమట్టం తక్కువగా ఉంది. కాబట్టి, వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆ దృశ్యాలను సామజిక మాధ్యమాలలో షేర్ చేయడంతో.. నెటిజన్లు కూడా దీనిపై రక రకాలుగా స్పదింస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించి నీటిలో కార్ ను డ్రైవ్ చేసినందుకు వారిపై చలానా వేశారు.

దీనిపై అక్కడి ఎస్పీ మాట్లాడుతూ.. ” చంద్రా నదిలో థార్ వాహనాన్ని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిన ఘటన మా దృష్టికి వచ్చింది. ఆ వాహనానికి సంబంధించిన వారిపై చర్యలు తీసుకున్నాం. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా చూస్తాము. నదీ ప్రాంతంలో పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశాము”. అంటూ చెప్పుకొచ్చారు. కాగా, న్యూ ఇయర్, క్రిస్టమస్ వేడుకులు ఉండడంతో అందరికి వరుస సెలవులు వచ్చాయి. దీనితో టూరిస్ట్ ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ ప్రాంతమంతా పర్యాటకులతో నిండిపోయింది. మనాలి, అటల్ టన్నెల్ మార్గాలలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పైగా పొగమంచు కారణంగా ట్రాఫిక్ కు మరింత అంతరాయం ఏర్పడుతోంది.

ఈ క్రమంలో గత మూడు నాలుగు రోజులలో ఆయా ప్రాంతాలలో.. యాభై ఐదు వేలకు పైగా వాహనాలు ప్రయాణించాయని అధికారులు తెలిపారు. ఇంకా న్యూ ఇయర్ కూడా త్వరలో రానుండడంతో ఈ వారం మరో లక్షకు పైగా వాహనాలు.. అక్కడికి చేరుకునే అవకాశం ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి సుక్వీందర్ సింగ్ మాట్లాడుతూ.. పర్యాటకులకు ఎటువంటి అంతరాయాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. ఇక ప్రస్తుతం చంద్రా నదిలో ప్రయాణించిన థార్ SUV వాహనం సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. మరి, ఈ నదిలో ప్రయాణించిన కార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.