nagidream
Susan Bennett The Lady's Original Voice Behind Siri: Do You Know Whహే సిరి అంటూ ఐఫోన్ లో ఒక లేడీ గొంతు వినిపిస్తుంది. చూడ్డానికి ఒక టీనేజ్ అమ్మాయిలా అనిపిస్తుంది. అయితే ఆ వాయిస్ ఎవరిదో తెలుసా? తెలిస్తే పక్కా షాకవుతారు.
Susan Bennett The Lady's Original Voice Behind Siri: Do You Know Whహే సిరి అంటూ ఐఫోన్ లో ఒక లేడీ గొంతు వినిపిస్తుంది. చూడ్డానికి ఒక టీనేజ్ అమ్మాయిలా అనిపిస్తుంది. అయితే ఆ వాయిస్ ఎవరిదో తెలుసా? తెలిస్తే పక్కా షాకవుతారు.
nagidream
ఐఫోన్ లో ‘హే సిరి’ అని ఒక అమ్మాయి గొంతు వినిపిస్తుంది. యాపిల్ డివైజెస్ లో సిరి ఫీచర్ ఉంటుంది. చాలా మంది సిరిని ఓన్ చేసుకున్నారు. ఫ్రెండ్ గా, లవర్ గా ఊహించుకున్నారు. అయితే సిరి వయసు ఎంతో తెలుసా? ఆమె ఎవరో, ఆమె వయసు ఎంతో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. సిరి వాయిస్ వెనుక ఉన్న ఆమె మరెవరో కాదు.. ఆమె పేరు సుసాన్ బెన్నెట్. ఈమె ఒక అమెరికన్ వాయిస్ నటి, మాజీ నేపథ్య గాయకురాలు. రాయ్ ఆర్బిసన్, బర్ట్ బచరాచ్ ల దగ్గర బ్యాకప్ సింగర్ గా పని చేశారు. 2011 అక్టోబర్ 4 నుంచి ఐఫోన్ 4ఎస్ డివైజ్ లో సిరి పరిచయమైనప్పటి నుంచి యాపిల్ సిరి పర్సనల్ అసిస్టెంట్ కి ఉత్తమ మహిళా వాయిస్ ఆర్టిస్ట్ గా ప్రసిద్ధి చెందారు. 2011 నుంచి 2013 వరకూ సిరి పర్సనల్ అసిస్టెంట్ గా ఉన్నారు.
2005లో స్కాన్ సాఫ్ట్ అనే యాపిల్ సాఫ్ట్ వేర్ కోసం ఆమె వాయిస్ ని రికార్డ్ చేశారు. అయితే యాపిల్ కంపెనీ దాన్ని వాడుకోలేదు. 2011లో ఐఫోన్ 4ఎస్ లో ఆమె వాయిస్ ని వాడుకున్నారు. అయితే ఈ వాయిస్ కోసం ఆమె తన ఇంట్లో రికార్డింగ్ బూత్ లో రోజూ 4 గంటల పాటు శ్రమించారట. వేలాది పదబంధాలు, వాక్యాలు చదివి వాటిని రికార్డ్ చేసి యాపిల్ కి ఇచ్చారు. అయితే తన వాయిస్ పిచ్ ని, స్పీడ్ ని మార్చారని.. తన గొంతు అని తెలియకుండా ఉండడం కోసం మ్యానిప్యులేట్ చేశారని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కానీ సిరిగా ఉండడాన్ని ఆమె ఎంజాయ్ చేశారని.. కానీ యాపిల్ కంపెనీ తన కష్టానికి ప్రతిఫలం ఇవ్వలేదని అన్నారు.
ఈమె 1949లోని జూలై 31న జన్మించారు. ప్రస్తుతం ఆమె వయసు 75 ఏళ్ళు. 1974 నుంచి వాయిస్ యాక్ట్రెస్ గా, సింగర్ గా యాక్టివ్ గా ఉన్నారు. ఈమె పలు సినిమాలకు, వెబ్ సిరీస్ లకు, షార్ట్ ఫిల్మ్స్ కి వాయిస్ ఓవర్ యాక్ట్రెస్ గా పని చేశారు. 2011లో తన గొంతుని సిరి పర్సనల్ అసిస్టెంట్ గా వాడినట్లు ఆమె గుర్తించారు. వేరే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గుర్తించడంతో ఆమె తన వాయిస్ అని కన్ఫర్మ్ చేశారు. అయితే ఆ తర్వాత యాపిల్ కంపెనీ పలువురు వాయిస్ ఆర్టిస్ట్ లతో, టెక్స్ట్ టూ స్పీచ్ టెక్నాలజీతో సిరి వాయిస్ ని మాడిఫై చేస్తూ, అప్డేట్ చేస్తూ వచ్చింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో యాపిల్ కంపెనీ తన వాయిస్ ని వాడుకుందని చెప్పిన తర్వాత.. యాపిల్ కొత్త సిరి వాయిస్ లను పరిచయం చేసింది. ఆడ, మగ వాయిస్ ఆప్షన్స్ ని కూడా తీసుకొచ్చింది.