iDreamPost
android-app
ios-app

వీడియో: విద్యార్థులు భోజనం చేస్తుండగా దారుణం..

  • Published Jul 20, 2024 | 1:59 PM Updated Updated Jul 20, 2024 | 1:59 PM

Class Room Wall Collapses: ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో విపరీతంగా వర్సాలు కురుస్తున్నాయి. పాత బడ్డ భవనాలు, గోడలు నానిపోవడం వల్ల కుప్పకూలిపోతున్నాయి. ఇలాంటి సంఘటనలు ఎక్కడో అక్కడ ప్రతిరోజూ జరుగుతునే ఉన్నాయి.

Class Room Wall Collapses: ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో విపరీతంగా వర్సాలు కురుస్తున్నాయి. పాత బడ్డ భవనాలు, గోడలు నానిపోవడం వల్ల కుప్పకూలిపోతున్నాయి. ఇలాంటి సంఘటనలు ఎక్కడో అక్కడ ప్రతిరోజూ జరుగుతునే ఉన్నాయి.

వీడియో: విద్యార్థులు భోజనం చేస్తుండగా దారుణం..

దేశ వ్యాప్త వ్యాప్తంగా రుతు పవనాలు చురుగ్గా వీస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా మహరాష్ట్ర, గుజరాత్, కేరళా, అస్సాం, తెలుగు రాష్ట్రాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వర్షాల కారణంగా నదులు, కాల్వలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గ్రామాలు పూర్తిగా జలదిగ్భంధంలో మునిగిపోయాయి. వర్షాల కారణంగా బీహార్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో వంతెనలు కూలిపోతున్నాయి. వర్షాలకు నానిపోయి పాత భవనాలు, గోడలు కుప్పకూలిపోతున్నాయి. విద్యార్థులు భోజనాలు చేస్తున్న సమయంలో హఠాత్తుగా జరిగిన సంఘటనకు అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

గుజరాత్ లోని ఓ పాఠశాలలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు బేంజీలపై కూర్చొని మధ్యాహ్నం భోజనం చేస్తుండగా హఠాత్తుగా తరగతి గోడ ఒక్కసారే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గుజరాత్ లోని వడోదరలోని శ్రీ నారాయణ్ గురుకుల విద్యాలయంలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. మొదటి అంతస్తులోని 7వ తరగతి గదిలో విద్యార్థులు మధ్యాహ్నం సరదగా ముచ్చట్లు పెడుతూ భోజనం చేస్తున్నారు. అంతలోనే తరగతి గోడ కూలిపోయింది.. దీంతో అక్కడే ఉన్న విద్యార్థులు కిందపడిపోయారు. శిథిలాలు విద్యార్థులపై పడటంతో గాయపడ్డారు. స్కూల్ సిబ్బంది,స్థానికులు అక్కడికి చేరుకొని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

ఈ సంఘటన గురించి స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ‘విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో విద్యార్థులు లంచ్ చేస్తున్నారు. గోడ పార్కింగ్ ప్రాంతంలో పడింది.. సైకిళ్లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులకు చికిత్స అందిస్తున్నాం.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదు. ప్రస్తుతం వారి ఆరోగ్యం బాగానే ఉంది’ అని అన్నారు. ఈ సంఘటన క్లాస్ రూమ్‌లో ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు ఇటీవల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాత పాఠశాలు మరమత్తు చేయించాలని లేదంటే ఇలాంటి ప్రమాదాలు మరిన్ని జరిగవొచ్చని కామెంట్స్ చేస్తున్నారు.