iDreamPost
android-app
ios-app

ఆవేశంగా రివ్యూస్ ఇచ్చే.. యాంగ్రీ రత్నం పరిస్థితి విషమం! ఆస్పత్రికి తరలింపు!

  • Published Apr 13, 2024 | 6:57 PM Updated Updated Apr 13, 2024 | 6:57 PM

సోషల్ మీడియాలో నిత్యం ఎంతో మంది వీడియోస్ చేస్తూ నెటిజన్లను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో .. యాంగ్రీ రాంట్ మ్యాన్ పేరుతో అందరిని నవ్వించే వ్యక్తి గురించి అందరికి తెలిసే ఉంటుంది. అతను హాస్పిటల్ ఉన్నాడంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు కొన్ని వార్తలు వస్తున్నాయి.

సోషల్ మీడియాలో నిత్యం ఎంతో మంది వీడియోస్ చేస్తూ నెటిజన్లను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో .. యాంగ్రీ రాంట్ మ్యాన్ పేరుతో అందరిని నవ్వించే వ్యక్తి గురించి అందరికి తెలిసే ఉంటుంది. అతను హాస్పిటల్ ఉన్నాడంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు కొన్ని వార్తలు వస్తున్నాయి.

  • Published Apr 13, 2024 | 6:57 PMUpdated Apr 13, 2024 | 6:57 PM
ఆవేశంగా రివ్యూస్ ఇచ్చే.. యాంగ్రీ రత్నం పరిస్థితి విషమం! ఆస్పత్రికి తరలింపు!

నిత్యం నెటిజన్ల ఎంటర్టైన్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన.. సోషల్ మీడియాలో ఎంతో మంది సోషల్ ఇన్ఫ్లుఎన్సర్స్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎంతో మంది ఇన్ఫ్లుఎన్సర్స్ ను చూసి ఉంటాము. వారిలో ఒక్కొక్కరిది ఒక్కక్క స్టైల్ ఉంటుంది. కొంతమంది డ్యాన్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తే.. మరి కొంతమంది సాంగ్స్ పాడుతూ.. కామెడీ, ప్రాంక్ వీడియోస్ చేస్తూ ప్రజలను నవ్విస్తూ.. వినోదాన్ని అందిస్తూ ఉంటారు. అయితే వీరందరిలానే యాంగ్రీ రాంట్ మ్యాన్ పేరుతో ఒక వ్యక్తి.. కోపంగా ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఫన్నీగా వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఈపాటికే ఆ వ్యక్తి ఎవరో అందరికి గుర్తొచ్చి ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ వ్యక్తి చాలా ఫేమస్ . అయితే కొన్ని రోజులుగా ఈ వ్యక్తి హాస్పిటల్ లో చేరడంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

సోషల్ మీడియాలో యాంగ్రీ రాంట్ మ్యాన్ పేరుతో వీడియోస్ చేసే ఈ వ్యక్తి చాలా ఫేమస్. ఇతను అన్ని జోనర్స్ కు సంబంధించిన కాన్సెప్ట్స్ పైన తనదైన శైలిలో రివ్యూస్ ఇస్తూ ఉంటాడు. ఇతనికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవెర్స్ కూడా ఎక్కువే. అయితే.. గత కొన్ని రోజులుగా ఈ వ్యక్తి బహుళ అవయవ వైఫల్యం వలన హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. అతనిని అప్పటినుంచి కూడా ఐసియు లోనే ఉంచారు. అయితే కొన్ని రోజుల క్రితం నుంచ.. అతను చికిత్సకు స్పందిస్తున్నాడు అంటూ.. కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. కానీ, ఇతనికి సహాయం చేసేందుకు ఎవరు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. జీవితం కోసం హాస్పిటల్ బెడ్ పై పోరాడుతున్నాడు. దీనితో అతని అభిమానులు ఆందోళనలో ఉన్నారు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో అంత హుందాగా.. నవ్వుతు కనిపించినంత మాత్రానా వారు సంతోషంగా ఉన్నారని అర్ధం కాదు. ఆ నవ్వు వెనుక దాచేసిన బాధలు ఎన్నో ఉంటాయి. ఆన్ లైన్ లో లక్షల కొద్దీ ఫాలోవెర్స్ ఉన్నా కానీ.. అవసరమైనప్పుడు ఒక్కరు కూడా వారి బాధలను పట్టించుకోరు. ఇప్పుడు యాంగ్రీ రాంట్ మ్యాన్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఇలానే ఎంతో మంది ఇన్ఫ్లుఎన్సర్స్ తమ వ్యక్తిగత జీవితాలలో చెప్పుకోలేని భాధలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు యాంగ్రీ రాంట్ మ్యాన్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని.. అతని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతున్నారు. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş