iDreamPost
android-app
ios-app

సన్నీయాదవ్ కు అన్వేష్ వార్నింగ్.. బంద్ చేయకపోతే చంపుతానంటూ..

  • Published Mar 26, 2024 | 6:34 PM Updated Updated Mar 26, 2024 | 6:34 PM

Anvesh- Bayya Sunny Yadav: నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్- భయ్యా సన్నీయాదవ్ గొడవ చినికి చినికి గాలివానగా మారింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఈ గొడవకు పుల్ స్టాప్ పెట్టేందుకు అన్వేష్ ముందుకొచ్చాడు.

Anvesh- Bayya Sunny Yadav: నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్- భయ్యా సన్నీయాదవ్ గొడవ చినికి చినికి గాలివానగా మారింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఈ గొడవకు పుల్ స్టాప్ పెట్టేందుకు అన్వేష్ ముందుకొచ్చాడు.

  • Published Mar 26, 2024 | 6:34 PMUpdated Mar 26, 2024 | 6:34 PM
సన్నీయాదవ్ కు అన్వేష్ వార్నింగ్.. బంద్ చేయకపోతే చంపుతానంటూ..

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో.. యూట్యూబ్- ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ఇద్దరు ప్రముఖ యూట్యూబర్ల గొడవ బాగా వైరల్ అవుతోంది. వాళ్లు మరెవరో కాదు.. సన్నీయాదవ్, అన్వేష్. వీళ్లిద్దరి మధ్య సోషల్ మీడియాలో ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది. మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్న ఇద్దరు సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్స్ చాలా దారుణంగా ట్రోల్ చేసుకుంటున్నారు. ఇద్దరి విషయంలో ఫ్యాన్స్ కూడా వారికి నచ్చిన వారికి సోపర్ట్ చేసుకుంటూ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. మొత్తానికి గొడవని మాత్రం నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ స్టార్ట్ చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత వారి మధ్య గొడవ చినికి చినికి గాలివానగా మారిపోయింది. ఇప్పుడు తాజాగా అన్వేష్ వార్నింగ్ ఇస్తూ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

భయ్యా సన్నీ యాదవ్ బైక్ మీద అమెరికా వెళ్లాను అంటూ చేసిన రీల్ ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలుసు. ఆ రీల్ ని ఉద్దేశించి రోస్ట్ చేస్తూ అన్వేష్ ఒక వీడియో చేశాడు. ఆ వీడియో చూసిన తర్వాత సన్నీయాదవ్ ఫుల్ ఫైర్ అయిపోయాడు. పట్టరాని ఆవేశంతో భయంకరంగా తిట్టాడు. ఆ మాటలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ తర్వాత మళ్లీ అన్వేష్ ఇంకో వీడియో చేశాడు. నా దగ్గర సన్నీ యాదవ్ చేసే 100 తప్పులకు సంబంధించి వివరాలు ఉన్నాయని చెప్పాడు. సన్నీ యాదవ్ పై ఎఫ్ఐఆర్ ఉంది. అతని బాబాయ్ తల పగలగొట్టాడు. ఒక పోలీస్ ఫ్యామిలీతో సన్నిహితంగా మెలిగి వారిని మోసం చేశాడు అంటూ చాలానే కామెంట్స్ చేశాడు. సన్నీయాదవ్ కూడా అన్వేష్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఒక వీడియో చేశాడు.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కి సంబంధించి కూడా కామెంట్స్ చేశాడు. తన కంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేశాడు. అలాగే తాను ఎవరినీ ఫోర్స్ చేయడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత అన్వేష్ మరో వీడియోతో నెటిజన్స్ ముందుకు వచ్చాడు. ఈసారి భయ్యా సన్నీయాదవ్ కి తమిళ్ అబ్బాయితో వివాహం జరిగింది అంటూ థంబ్ పెట్టేశాడు. మొత్తానికి ఈ గొడవకు ఇక్కడితో పుల్ స్టాప్ పడదు అనుకుంటున్న తరుణంలో అన్వేష్ ఇక్కడితో ఈ గొడవ ఆపేద్దాం అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఆ సందర్భంగా సన్నీ యాదవ్ కి ధమ్మీ కూడా ఇచ్చాడు.

“తెలంగాణ ముద్దుబిడ్డ భయ్యా సన్నీయాదవ్ నీకు నాకు లొల్లొద్దు. ఇక్కడితో బంద్ చేయ్ ముచ్చట. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం బంద్ చేయ్. రోజూ టెలిగ్రామ్ గ్రూప్ లో కుర్రాళ్లకు రూ.500 ఇస్తున్నావ్ అది బంద్ చేయ్. ఐఫోన్లు ఇస్తున్నావ్ అది బంద్ చేయ్. బళ్లు ఫ్రీగా ఇస్తున్నావ్ అది బంద్ చేయ్. ఆ డబ్బుల్తో ట్రావెలింగ్ చేయ్. మళ్లీ మళ్లీ చెప్తున్నా.. నా దగ్గరున్న సబ్ స్క్రైబర్స్ పెద్దవాళ్లు. వాళ్లు పోయినా పర్లేదు. కానీ, నీ దగ్గర ఉన్న 40 లక్షల మంది పోరగాళ్లు చస్తున్నారు. ఇంకోసారి బెట్టింగ్ యాప్స్ చేశావంటే నీ దుకాణంలో ఒక్క ల్యాప్ ట్యాప్ ఉండదు అన్నీ మాయమైపోతాయి. బంద్ చేయ్ లేకపోతే చంపేస్తా నా కొ*కా” అంటూ నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ గొడవకు పుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నం చేశాడు. అయితే భయ్యా సన్నీ యాదవ్ ఇక్కడితో ఈ గొడవను ఆపుతాడా? ఇలాగే కొనసాగిస్తాడా? చూడాలి. మరి.. వీళ్లిద్దరి గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş