iDreamPost
android-app
ios-app

హైవేపై కుప్ప కూలిన విమానం.. వైరల్ వీడియో!

  • Published Aug 17, 2023 | 10:02 PM Updated Updated Aug 17, 2023 | 10:02 PM
  • Published Aug 17, 2023 | 10:02 PMUpdated Aug 17, 2023 | 10:02 PM
హైవేపై కుప్ప కూలిన విమానం.. వైరల్ వీడియో!

ఘోర విమాన ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అందరూ చూస్తుండగా.. హైవేపై విమానం కుప్పకూలింది. విమానంలో ఉన్న ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు క్రూ మెంబర్స్, రోడ్డుపై ఉన్న ఇద్దరు వాహనదారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదం మలేషియాలో జరిగింది. హైవేపై వెళ్తున్న ఓ కారు డ్యాష్ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అవి నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మలేషియాలోని నాలుగు లైన్ల హైవేపై ఈ విమాన ప్రమాదం సంభవిచింది. ఈ ఘోర ప్రమాదం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఆకాశం నుంచి ఒక్కసారిగా ఊడిపడినట్లు విమానం రోడ్డుపై కూలింది. ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించినట్లు మంటలు చెలరేగాయి. నల్లటి పొగ ఆకాశాన్ని కప్పేసింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ మొత్తం ప్రమాదం ఓ కారు డ్యాష్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ ఒళ్లు గగుర్పొడియే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మలేషియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ జెట్ లాంగ్కావి లోని నార్తర్న్ రిసార్ట్ ఐలాండ్ నుంచి బయటలు దేరింది. అది మలేషియా రాజధాని కౌలాలంపూర్ కి పశ్చిమాన ఉన్న సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. విమానంలో క్రూ మెంబర్స్ తో కలిపి ఎనిమిది మంది ఉండగా.. అందరూ చనిపోయారు. రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు వాహనదారులు కూడా ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మలేషియా సివిల్ ఏవియేషన్ అధికారులు మాత్రం.. తమకు ఈ విమానం నుంచి ఎలాంటి మేడే సిగ్నల్స్ రాలేదంటూ తెలియజేశారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibom