iDreamPost
android-app
ios-app

వీడియో: ఇదెక్కడి విడ్డూరం.. డబ్బులిచ్చి మరీ కొట్టించుకుంటున్న కస్టమర్లు!

ఇటీవల సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి రక రకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు చూస్తుంటే నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? అన్న ఆశ్చర్యం కలుగుతుంది.

ఇటీవల సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి రక రకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు చూస్తుంటే నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? అన్న ఆశ్చర్యం కలుగుతుంది.

వీడియో: ఇదెక్కడి విడ్డూరం.. డబ్బులిచ్చి మరీ కొట్టించుకుంటున్న కస్టమర్లు!

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చిత్ర విచిత్రమైన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎంతోమంది తమ టాలెంట్ తో ఎదో ఒక వెరైటీ ప్రదర్శణ ఇస్తూ వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. కొన్ని వీడియోలు క్లిక్ కావడంతో రాత్రికి రాత్రే సెలబ్రెటీలు అవుతున్నారు. కొన్ని వీడియోలు కామెడీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు భయాన్ని పుట్టించే విధంగా ఉంటాయి. మొత్తానికి ఈ వీడియోల పుణ్యమా అని మనం ఎన్నడూ చూడని వీడియోలు చూసే ఛాన్స్ దొరుకుతుది. ఓ రెస్టారెంట్ లో జరుగుతున్న విచిత్రానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ రెస్టారెంట్ లో అంత ప్రత్యేకత ఏముందీ అని అనుకుంటున్నారా? అసలు విషయం తెలుసుకుందాం. పూరి వివరాల్లోకి వెళితే..

సాధారణంగా కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితులు రెస్టారెంట్స్ కి వెళ్లి తమకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి తింటుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.. కానీ ఓ రెస్టారెంట్ కి వెళ్లె కస్టమర్లు మాత్రం అక్కడ సిబ్బందితో డబ్బులు ఇచ్చి మరీ చెంపదెబ్బలు కొట్టించుకుంటున్నారు. ఇదెక్కడి విడ్డూరం అని అనిపించినా.. ఇది నిజం. గోయా నగరంలో ఉణ్న సాచి హూకో-యా ఇకజయా అనే రెస్టారెంట్ లో అమ్మాయిలు చెంప దెబ్బలు వాయిస్తూ కనిపిస్తుంటార. అంతగా రెస్టారెంట్ కి వెళ్లి డబ్బులు ఇచ్చి అందమైన అమ్మాయిలతో పూవులతో కొట్టించుకోవాలి.. కానీ చెంపలు కందిపోయేలా కొట్టించుకోవడం ఏంటీ అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇక్కడ చెంపదెబ్బలు కొట్టడం కోసం ప్రత్యేక సర్వీస్ ఏర్పాటు చేశామని రెస్టారెంట్ యాజమాన్యం అంటుంది.

సాచిహోకో-యా ఇకజయా రెస్టారెంట్ లో స్నాక్స్, భోజనం, టిఫిన్ తో పాటు చెపంలు వాయించే సేవలు కూడా అందిస్తుంది ఆ రెస్టారెంట్. అలా చెంపదెబ్బలు తిన్నవాళ్లు జపాన్ కరెన్సీలో 300 యెన్ లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.170 చెల్లించాలి. విచిత్రం ఏంటంటే చెంపదెబ్బలు తినేందుకు ఆ రెస్టారెంట్ కి జనాలు క్యూ కడుతున్నారని అందుకే ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామని యాజమాన్యం చెప్పడం గమనార్హం. కొంతమంది కస్టమర్లు 300 వందలే కాదు అదనంగా 200 మొత్తం రూ.500 ఇచ్చి మరీ కాస్త ఎక్కువ చెంపదెబ్బలు తింటున్నారు. ఇది వింటానికి, చూడటానికి కాస్త విడ్డూరం అనిపించినా.. విదేశీ పర్యటకులు కూడా భారీ సంఖ్యలో వస్తున్నారని రెస్టారెంట్ యాజమాన్యం అంటుంది. ఈ వింత సర్వీసు 2012 లో ప్రారంభం అయ్యిందట. మొదట్లో ఇది కాస్త వివాదం అయినా.. తర్వాత ఒక రకమైన సెంటిమెంట్ కలిసి రావడంతో ఈ వింత సర్వీస్ బాగా ఫేమస్ అయ్యిందట. మొదట్లో కస్టమర్లకు ఆహారం సప్లై చేసిన వారే కొట్టేవారట.. డిమండ్ బాగా పెరిగిపోవడంతో ప్రత్యేక సర్వీస్ ఏర్పాటు చేసి మరీ చెంపలు వాయిస్తున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. చెంపలు వాయించే ఈ వింతైన సర్వీస్ గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి