P Krishna
Australian Woman: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ముంబైలో కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి.
Australian Woman: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ముంబైలో కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి.
P Krishna
దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా వర్షాలే వర్షాలు. రుతుపవనాల ప్రభావంతో దేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. మహారాష్ట్ర, అస్సాం, కేరళా, గుజరాత్, తెలుగు రాష్ట్రాల్లో కుంభవృష్టి కురుస్తుంది. భారీ వర్షాల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సుదూర ప్రయాణాలు చేసేవారు ఎన్నో ఇక్కట్లకు గురవుతున్నారు. మరో వారం రోజుల పాటు వర్షాలు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. గత కొన్నిరోజులుగా ముంబైలో కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు జలమయం అయ్యాయి.. రైలు సర్వీసులు దెబ్బతిన్నాయి. ఇలాంటి సమయంలో ఓ డ్రైవర్ చేసిన పనికి ఆస్ట్రేలియా మహిళ ప్రశంసలు కురిపిస్తూ వీడియో పోస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే..
గత కొద్దిరోజులుగా మహారాష్ట్రలోని ముంబై ఇతర ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రయాణికులు, వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో ముంబయిలోని ఉబెర్ డ్రైవర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ఆస్ట్రేలియా మహిళ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ చేసిన పోస్టు తాజాగా వైరల్ అవుతుంది. ఆస్ట్రేలియన్ కు చెందిన బ్రీ స్టీల్ అనే మహిళ టూరిస్టుగా భారత్ కి వచ్చారు. ఆమె తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు తాను బస చేస్తున్న హూటల్ నుంచి విమానాశ్రయానికి ఒక ఊబెర్ బుక్ చేసింది. కానీ అప్పటికే భారీగా వర్షం పడుతుంది.. రోడ్డుపై నీళ్లు నిలిచి ఉన్నాయి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బ్రీ స్టీల్ తాను విమానాశ్రయానికి వెళ్తానా అన్న అనుమానం కలిగింది.
ఆమె బుక్ చేసుకున్న ఊబెర్ డ్రైవర్ ఎలాంటి ఇబ్బంది పడకండి టైమ్ కి చేర్చుతాను అని చెప్పి.. ఆ సమయంలో డ్రైవర్ కారు నడిపిన విధానం, సమయస్ఫూర్తి ఆమెను ఆశ్చర్యపరిచింది. బ్రీ స్టీల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేస్తూ ‘నిజంగా భారతీయులు ఈ గ్రహం మీద చక్కన.. అద్భుతమైన వ్యక్తులు.. రాత్రి 3 గంట ప్రాంతంలో కూడా సహాయాన్ని అందిస్తారు. వరద నీటిలో క్యాబ్ ని నడుపుతూ నన్ను సరైన సమయానికి విమానాశ్రయానికి తీసుకువచ్చాడు. నేను ఆస్ట్రేలియా వెళ్లి పోయాను’ అంటూ ఇటీవల వీడియో షేర్ చేసింది. ఈ వీడియో 221,000 కంటే ఎక్కువ లైక్‌లను మరియు 2 మిలియన్లకు పైగా వీక్షించారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతుంది.