iDreamPost
android-app
ios-app

పెళ్లిలోడ్యాన్స్ వేయమన్న వధువు.. కింద పడేసి బోర్లించిన పెళ్ళికొడుకు!

  • Published Feb 22, 2024 | 5:07 PM Updated Updated Feb 22, 2024 | 5:07 PM

ఈ మధ్య కాలంలో వివాహ వేడుకల్లో వధూ వరులు, కుటుంబ సభ్యులు ఆనందంగా డాన్స్ చేయడం లాంటివి చూస్తూనే ఉన్నాము. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో మాత్రం వధువు డాన్స్ చేయడనికి దగ్గరికొస్తే వరుడు ఏం చేసాడంటే..

ఈ మధ్య కాలంలో వివాహ వేడుకల్లో వధూ వరులు, కుటుంబ సభ్యులు ఆనందంగా డాన్స్ చేయడం లాంటివి చూస్తూనే ఉన్నాము. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో మాత్రం వధువు డాన్స్ చేయడనికి దగ్గరికొస్తే వరుడు ఏం చేసాడంటే..

  • Published Feb 22, 2024 | 5:07 PMUpdated Feb 22, 2024 | 5:07 PM
పెళ్లిలోడ్యాన్స్ వేయమన్న వధువు.. కింద పడేసి బోర్లించిన పెళ్ళికొడుకు!

ఒకప్పుడు కాలం నాటి పెళ్లి తంతు వేరు .. ఇప్పుడు పెళ్లి తంతు వేరు. అప్పట్లో పెళ్లి అంటే వధూ వరులు ఇద్దరు బిడియంతో ఉండేవారు. కానీ, మారుతున్న కాలంతో పాటు.. అటువంటివి కూడా మారిపోయాయి. ఇప్పుడు ఎంచక్కా వధూవరులిద్దరూ చక్కగా వారి వివాహ వేడుకను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి బిందెలో ఉంగరాలు తీయడం, తలంబ్రాలు చల్లుకోవడం, డ్యాన్స్ చేయడం .. స్నేహితులు వారిని ఆటపట్టించడం ఇలాంటివి అన్నీ .. హాస్యాస్పదంగా .. సరదాగా జరుగుతూనే ఉంటాయి. ఇప్పటివరకు ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో చాలా చూసి ఉంటాం. కానీ, తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మాత్రం అందరు షాక్ అవుతున్నారు. ఆ వీడియోలో వధువు డ్యాన్స్ చేసేందుకు ప్రేమతో వరుడి దగ్గరకు వస్తే.. చివరికి వరుడు ఏం చేసాడో చూసి .. అందరూ ఆశ్చర్యపోయారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోను గమనిస్తే.. అప్పుడే పెళ్లి అయిన కొత్త జంట .. వారి చుట్టూ కొంతమంది స్నేహితులు కనిపిస్తూ ఉంటారు. వివాహ వేడుకలో భాగంగా వధూ వరుల ఎదుట వారి స్నేహితులు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. కొంతసమయానికి వారితో పాటు వధువు కూడా జత కలుపుతుంది. అలా కొంతసేపు డ్యాన్స్ చేసిన తరువాత .. అక్కడున్న వారంతా వధూ వరులు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయాలనీ బలవంతం చేస్తారు. దీనితో అయిష్టంగానే వరుడు ముందుకు వస్తాడు. అప్పుడు వధువు ప్రేమగా వరుడి దగ్గరికి వెళ్లి డాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ , వరుడు మాత్రం డ్యాన్స్ చేయడానికి అంత ఇష్టం చూపించడు. అయినా సరే వధువు వరుడిని వదలకపోవడంతో.. వరుడు ఒక్కసారిగా వైలెంట్ గా ప్రవర్తించడం మొదలుపెట్టి .. వధువుపై అరిచేస్తూ.. ఆమెను గిర గిరా తిప్పి కింద పడేస్తాడు.

అక్కడితో ఆగకుండా ఆ వధువుపైన అక్కడున్న వారిపైన కోపంగా అరిచేస్తాడు. వధువుని పట్టుకుని.. ‘‘ఇలా ఎవరైనా డాన్స్ చేస్తారా’’.. అంటూ ఆమెను కూడా ఇబ్బంది పెడతాడు. ఇక ఆ తర్వాత అక్కడున్న యువకులు వరుడిని పట్టుకుని పక్కకు తీసుకెళ్తారు. దీనితో అప్పటివరకు సందడిగా ఉన్న వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. వరుడి వైలెంట్ బిహేవియర్ కు అందరూ షాక్ అవుతారు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసినా నెటిజన్లు .. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbigbossgrandpashabet