iDreamPost
android-app
ios-app

యువతి బంపరాఫర్‌.. రెంట్‌ ఇస్తే గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటానంటూ పోస్ట్‌.. రోజుకు 10 వేలే అంట

  • Published May 30, 2024 | 1:18 PM Updated Updated May 30, 2024 | 1:18 PM

ఓ యువతి ఇచ్చిన బంపరాఫర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాను ఊపేస్తుంది. రెంట్‌ ఇస్తే మీ గర్ల్‌ ఫ్రెండ్‌గా ఉంటానంటూ ఆమె చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

ఓ యువతి ఇచ్చిన బంపరాఫర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాను ఊపేస్తుంది. రెంట్‌ ఇస్తే మీ గర్ల్‌ ఫ్రెండ్‌గా ఉంటానంటూ ఆమె చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

  • Published May 30, 2024 | 1:18 PMUpdated May 30, 2024 | 1:18 PM
యువతి బంపరాఫర్‌.. రెంట్‌ ఇస్తే గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటానంటూ పోస్ట్‌.. రోజుకు 10 వేలే అంట

కొన్నాళ్ల ముందు వరకు డేటింగ్‌, లివిన్‌ రిలేషన్స్‌, అద్దెకు బాయ్‌ఫ్రెండ్‌, గర్ల్‌ ఫ్రెండ్‌.. ఇలాంటి పద్దతులను విదేశాల్లోనే చూసే వాళ్లం. అయితే నెమ్మదిగా ఇవి ఇండియాకు కూడా వ్యాపిస్తున్నాయి. మన దగ్గర కూడా మెట్రో నగరాల్లో లివిన్‌ రిలేషన్‌లు చాలా కామన్‌ అయ్యాయి. ఇప్పటి వరకు అయితే ఇండియాలో రెంట్‌కు గర్ల్‌ ఫ్రెండ్‌, బాయ్‌ఫ్రెండ్‌ను తీసుకునే పద్దతి అయితే రాలేదు. కానీ కొందరు యువతి, యువకులు మాత్రం.. తమను తాము బాయ్‌ఫ్రెండ్‌, గర్ల్‌ఫ్రెండ్స్‌గా అద్దెకు ఇచ్చుకునేందుకు మందుకు వస్తున్నారు. పైగా వారికి వారే ఓ రేటు కూడా ఫిక్స్‌ చేసుకుంటున్నారు. తోడు లేక బోర్‌గా ఫీలవుతున్నారు.. రోజుకు ఇంత చెల్లిస్తే.. నేను మీతో డేట్‌కు వస్తానంటూ.. ఏకంగా సోషల్‌ మీడియా వేదికగానే ప్రకటిస్తున్నారు. తాజాగా ఓ యువతి ఇలాంటి పోస్టే చేసింది.

మీకు సింగిల్‌గా ఉండి బోర్‌ కొడుతుందా.. అయితే నేను మీతో డేట్‌కు వచ్చేందుకు రెడీగా ఉన్నాను. కాకపోతే రోజుకు 5 వేల చొప్పున చెల్లించాలి అని సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేసింది ఓ యువతి. ఇది చూసిన నెటిజనులకు దిమ్మ తిరిగిపోయింది. వార్నీ.. ఇండియాలో కూడా ఇలాంటి పనులు మొదలు పెట్టారా.. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్‌ తల్లి.. అటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఆ వివరాలు..

తాజాగా దివ్య గిరి అనే యువతి సోషల్‌ మీడియాలో తనను తాను గర్ల్‌ఫ్రెండ్‌గా అద్దెకు ఇచ్చుకోవడానికి రెడీగా ఉన్నానంటూ పోస్ట్‌ చేసింది. ‘‘మీరు సింగిల్‌గా ఉన్నారా.. డేట్‌కు వెళ్లాలనిపిస్తోందా.. అయితే నేను మీతో రావడానికి రెడీగా ఉన్నాను.. మీ గర్ల్‌ఫ్రెండ్‌గా నన్ను రెంట్‌కు తీసుకొండి. అద్భుతమైన జ్ఞాపకాలు సొంతం చేసుకొండి’’ అని రాసుకొచ్చింది. అంతేకాక తనను గర్ల్‌ఫ్రెండ్‌గా డేట్‌కు తీసుకెళ్లాలంటే ఎంత అద్దె చెల్లించాలో కూడా వివరింది. కాఫీ డేట్‌ అయితే 1500 రూపాయలు, నార్మల్‌ డేట్‌ అంటే సినిమాకు వెళ్లి.. ఆపైన డిన్నర్‌ చేయడం అయితే 2000, కుటుంబాన్ని కలవడం కోసం అయితే 3000.. ఏదైనా ఈవెంట్‌కి తనను తీసుకెళ్లాలంటే 3500.. బైక్‌ డేట్‌ అంటే చేతులు పట్టుకునే వరకు అయితే 4 వేలు అంటూ పోస్ట్‌ చేసింది.

అంతేకాక తనతో డేట్‌కు వచ్చిన సంగతిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే.. అందుకు 6 వేల రూపాయలు చెల్లించాలి అని చెప్పుకొచ్చింది. ఇక రోజు మొత్తం కలిసి ఉండాలంటే.. 5 వేలు, ఇంట్లోనే ఉంటూ కలిసి.. వంట చేసుకుని తినడానికి 3500.. తనతో కలిసి షాపింగ్‌ చేయాలంటే 4500.. వీకెండ్‌ గెట్‌ అవే అంటూ ఇద్దరు కలిసి ఎక్కడికైనా ట్రిప్‌కు వెళ్లాలనుకుంటూ 10 వేలు చెల్లించాలి అని చెప్పుకొచ్చింది. ఇలా ఒక్కో ప్రొగ్రామ్‌కి ఒక్కో రేటు ఫిక్స్‌ చేసింది. ఇక ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. అసలు ఇది నిజమేనా.. కేవలం సోషల్‌ మీడియా అటెన్షన్‌ కోసం ఇలా చేశావా అని కామెంట్స్‌ చేస్తున్నారు. ఒకవేళ నిజమే అయితే.. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్‌ తల్లి అంటున్నారు నెటిజనులు.

 

View this post on Instagram

 

A post shared by Divya Giri (@divya_giri__)

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibombetandyou girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis