iDreamPost
android-app
ios-app

వీడియో: వరకట్నం కింద బైక్ అడిగిన పెళ్లికొడుకు.. చెప్పుతో కొట్టిన తండ్రి!

  • Published Mar 18, 2024 | 3:35 PM Updated Updated Mar 18, 2024 | 3:35 PM

Father Beats his Son with Slippers: కట్నం చట్టరిత్యా నేరం అని తెలిసినా.. నేటి సమాజయంలో కట్నం లేనిదే పెళ్లిళ్లు జరగడం లేదు. పెళ్లి సమయంలో గొంతెమ్మ కోరిక కోరిన వరుడిని తగిన బుద్ది చెప్పాడు తండ్రి

Father Beats his Son with Slippers: కట్నం చట్టరిత్యా నేరం అని తెలిసినా.. నేటి సమాజయంలో కట్నం లేనిదే పెళ్లిళ్లు జరగడం లేదు. పెళ్లి సమయంలో గొంతెమ్మ కోరిక కోరిన వరుడిని తగిన బుద్ది చెప్పాడు తండ్రి

  • Published Mar 18, 2024 | 3:35 PMUpdated Mar 18, 2024 | 3:35 PM
వీడియో: వరకట్నం కింద బైక్ అడిగిన పెళ్లికొడుకు.. చెప్పుతో కొట్టిన తండ్రి!

ఈ మధ్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతున్నాయి. వాటిలో కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటే.. కొన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటున్నాయి.  ఇటీవల పెళ్లి వేడుకల్లో రక రకాల సంఘటనలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లి సమయంలో తాగి వచ్చిన పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు తిరస్కరించడం, పెళ్లి మండపంలో పూలదండలు మార్చుకునే సమయంలో జరిగే అల్లరి, అదనపు కట్నం అడిగిన వరుడిని చెప్పుతో కొట్టడం ఇలా ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా పెళ్లి పీటలపై కొత్త పెళ్లి కొడుకుని చెప్పుతో కొట్టే వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే..

భారత దేశంలో అన్ని మతాలు, కులాలవారు పెళ్లి సందర్భంగా వరకట్నం ఇవ్వడం ఆనవాయితీగా మారిపోయింది. వరకట్నం తీసుకోవడం చట్టరిత్యా నేరం. అయినప్పటికీ వివాహ నిశ్చయం సందర్భంగా ఇరు కుటుంబ పెద్దలు కలిసి కట్న కానుకల గురించి మాట్లాడుకొని పెళ్లి ముహూర్తం ఖరారు చేస్తుంటారు. కొంతమంది పెళ్లి కొడుకులు తాళిబొట్టు కట్టే సమయంలో తమకు అదనంగా కారు, బైక్, బంగారం ఇలా ఎన్నో రకాల గొంతెమ్మ కోరికలు కోరుతుంటారు. కొంతమంది తల్లిదండ్రులు తప్పని సరి పరిస్థితుల్లో పెళ్లి కొడుకు కోరికలు తీర్చేందుకు ఒప్పుకుంటారు. కొంతమంది మాత్రం పెళ్లి కొడుకు గొంతెమ్మ కోరికలు తీర్చలేక పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.

పెళ్లి సందర్భంగా వరుడు తల్లిదండ్రులు తమ కొడుక్కి పెట్టి పోతల విషయంలో ఎన్నో రకాల కోరికలు కోరుతుంటారు. అన్నీ నిశ్చయం అయ్యాకే పెళ్లి తంతు ముగిస్తారు. లేదంటే పెళ్లి రద్దు చేసుకుంటారు.  పెళ్లైన తర్వాత కూడా అదనపు కట్నం కోసం భర్త, అత్త మామలు కోడిలిని చిత్ర హింసలకు గురి చేసి చంపుతున్న సంఘటనలో ఎన్నో జరుగుతూన్నాయి. ఓ పెళ్లి వేడుకలో దీనికి విరుద్దంగా ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి పీటలపై తనకు బైక్ కావాలని గొంతెమ్మ కోరిక కోరిన పెళ్లి కొడుకుని సొంత తండ్రి చెప్పుతో అందరూ చూస్తుండగానే కొట్టాడు. నీకు మోటర్ సైకిల్ కావాలా? అయితే నీ పొలం అమ్ముకొని తీసుకో.. వాళ్లను ఎందుకు అడుగుతావ్ అంటూ చెప్పుతో కొడుతూ ముందు తాళి కట్టు అని గద్దించాడు. దీంతో పెళ్లి కొడుకు బిక్క మొఖం వేసుకొని తాళిబొట్టు కట్టాడు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలైంది.. ఈ సందర్బంగా ఓ పాత వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş